కాశీబుగ్గ, ఆగస్టు 22 : వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ప్రకటించడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా అరూరిని లక్ష మోజార్టీతో మూడోసారి గెలిపిస్తామని 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీబారాణి అనిల్ అన్నారు. మంగళవారం 3వ డివిజన్లోని పైడిపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, పటాకులతో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మూడో సారి బరిలో నిలిచేందుకు అరూరి రమేశ్‌కు సీటు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అరూరిని రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లతో గెలిపించుకుంటామన్నారు. విలీన గ్రామాల అభివృద్ధిని చూసి, ప్రజలే ఆయనను ఆశీర్వదిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, పండుగ రవీందర్‌రెడ్డి, జన్ను సారంగపాణి, ఇట్యాల సతీశ్, జన్ను స్వామిదాస్, వీర యాకుబ్, బైరబోయిన వినయ్, కరుణాకర్, రాజయ్య, లింగం సాంబమూర్తి, కొండం కిశోర్, చిలుక రాజు, సింగారపు కుమార్ పాల్గొన్నారు.
నయీంనగర్/పర్వతగిరి : మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన అరూరి రమేశ్‌ను హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి, పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పర్వతగిరి ఎంపీపీ కమల పంతులు, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మార్కెట్ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, మనోజ్‌కుమార్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జితేందర్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు నరేందర్వర్మ, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ చిన్నపాక శ్రీనివాస్, చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడుగుల రాజు, జంగిలి యాకయ్య, సోషల్ మీడియా కన్వీనర్ బొట్ల మధు, శ్రావణ్ గౌడ్, కళాకారులు యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.