హనుమకొండ, జూలై 2 : టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న 433 అన్ యూజ్డ్ పోస్టులను రద్దు చేసి కొత్తగా 339 ఉద్యోగాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 93ను బుధవారం జారీ చేసింది. సర్వీసులు పెరుగడం, ఏరియా విస్తరించడం, డివిజన్లు, జిల్లాలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు సరఫరా చేసేందుకు గాను వీటిని మంజూరు చేసినట్లు జీవోలో పేర్కొన్నారు.
కొత్తగా మంజూరైన వాటిలో చీఫ్ ఇంజినీర్-1, చీఫ్ జనరల్ మేనేజర్(అకౌంట్స్)-1, జాయింట్ సెక్రటరీ-1(పీ అండ్ జీ), సూపరింటెండెంట్ ఇంజనీర్-4, జనరల్ మేనేజర్(పీ అండ్ జీ)-1, డివిజనల్ ఇంజినీర్-4, సీనియర్ అకౌంట్ ఆఫీసర్-4, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్-6, అకౌంట్ ఆఫీసర్-1, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్-2, పర్సనల్ ఆఫీసర్-4, అసిస్టెంట్ ఇంజినీర్లు-16, సబ్ ఇంజినీర్లు- 16, జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు-20, సీనియర్ అసిస్టెంట్లు-88, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు-32, అసిస్టెంట్ లైన్మన్లు-48, ఆఫీస్ సబార్డినేట్స్-80, వాచ్మన్స్-4, స్వీపర్ కమ్ గార్డెనర్, స్వీపర్, సానిటరీ పోస్టులు ఉన్నాయి.