తొర్రూరు, జూలై 9 : తొర్రూరులో వంద పడకల ఆస్పత్రి భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్మిస్తున్నారు. పేరు కోసం గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంజూరు చేసిన విశాలమైన స్థలాన్ని మార్పు చేసి 30 బెడ్స్ దవాఖాన వెనుక భాగంలో కడుతున్నారు. ఇక్కడ ఇరుకైన స్థలంతో పాటు భవిష్యత్ విస్తరణపరంగా ఇబ్బందులు తలెత్తనున్నాయి. పట్టణంలో వైద్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు రూ. 36 కోట్లు మంజూరు చేసింది. అయితే ఎవరికీ తెలియకుండా అధికారులు కనీసం భూమి పూజ నిర్వహించకుండా 30 పడకల దవాఖాన వెనుకభాగంలో భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న పోస్టుమార్టం గదిని తొలగించి అదే ప్రాంగణంలో వర్టికల్ విధానంలో (బహుళ అంతస్తులుగా) నిర్మిస్తున్నారు. వంద పడకల ఆస్పత్రి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే మరో 80 మంది సిబ్బంది అదనంగా నియమించాల్సి ఉంది. అంతేకాకుండా ఓపీ సేవల కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు, అంబులెన్స్‌ల కోసం తగిన పారింగ్ స్థలం లేకపో వడం వల్ల ఇబ్బందులు ఎదురుకానున్నాయి. భవిష్యత్ విస్తరణ, రహదారి, పచ్చదనం వంటి మౌలిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేరు కోసమే అకడ నిర్మాణం!
కొన్నేళ్ల క్రితం ఎన్ఆర్ఐగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి హనుమాండ్ల పాపిరెడ్డి, స్మారకార్థకంగా పీహెచ్సీ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆమె టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉండడంతో 100 పడకల ఆసుపత్రిని పేరు కోసమే పీహెచ్సీ భవనం వెనుక నిర్మిస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది. దశాబ్దాల క్రితం నిర్మించిన పీహెచ్సీ భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉండ గా, దానిని తొలగించకుండా అదే ప్రాంగణంలో 100 పడకల దవాఖానను నిర్మిస్తే భద్రత, విస్తరణపరంగా ఇబ్బందులకు దారితీయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే, పీహెచ్సీ అర్బన్ హెల్త్ సెంటర్‌గా కొనసాగాల్సి ఉండగా, దానికి అనుసంధానంగా కొత్త ఆసుపత్రి నిర్మించడం వల్ల దాన్ని మాటేడు గ్రామానికి మారే తరలించే అవకాశం ఉంది. ఆసుపత్రి నిర్మాణ స్థల ఎంపికలో ప్రజా అవసరాల కంటే రాజకీయ, పేరుప్రతిష్టలకే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరిపెడకు ట్రామా సెంటర్?
గతేడాది ట్రామా సెంటర్ మంజూరు కాగా, ప్రస్తుతం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తగి న స్థలం లేకపోవడంతో భవిష్యత్‌లో దాన్ని ఎకడ నిర్మిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ట్రామా సెంటర్‌కు 50 పడకల గదులు ఏర్పాటుకు అదనపు భవనం, పారింగ్, ఇతర మౌలిక వసతులు అవసరం కానున్నాయి. డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, పాలియేటివ్ కేర్, సీటీ సాన్, అల్ట్రా సౌండ్ తదితర ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ క్రమంలో ఈ కేంద్రాన్ని మరిపెడకు తరలించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 100 పడకల భవనానికి ప్రణాళికలు రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు.