హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో పల్లెలకు కూడా విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు కట్టడి చేయాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాలను ప్రభావితం చేస్తూ సమాజాన్ని మత్తుపదార్థాలు కలుషితం చేస్తున్నాయని వెల్లడించారు. డ్రగ్స్ కల్చర్‌ను తక్షణమే నివారించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలని సూచించారు. మత్తు పదార్థాలను సరఫరా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు.