హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : పశువైద్య విద్యార్థులు పాఠ్యాంశ పరిజ్ఞానంతోపాటు శస్త్రచికిత్సలోనూ నైపుణ్యాలు పెంచుకోవాలని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఎం జ్ఞానప్రకాశ్ పేర్కొన్నారు. గురువా రం రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ విద్యార్థులకు ‘పెంపుడు జంతువుల ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో జ్ఞాన నైపుణ్యాభివృద్ధి ద్వారా జీవనోపాధి-ఔత్సాహిక అభివృద్ధి’ అనే అంశంపై శిక్షణ నిర్వహించారు. పెంపుడు జంతువుల వైద్యంవల్ల పెరుగుతున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉదయ్‌కుమార్, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డీ మాధురి, సమన్వయకర్త రాధాకృష్ణారావు పాల్గొన్నారు.