బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Jan 11, 2021 , 00:47:28

ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

  • పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయం
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

దుగ్గొండి, జనవరి 10: ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నాచినపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మట్ట సుజాతారాజు సహకారంతో గ్రామంలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టగా, ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పెండ్యాల మమతారాజు, ఎంపీటీసీ నగరబోయిన మమతామోహన్‌, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలు, ఆలయ అర్చకుడు రమేశ్‌మూర్తి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని పెద్దికి వినతి

నర్సంపేట: నర్సంపేట ఆర్టీసీ డిపోలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ సంఘం నాయకులు బత్తిని రవి, బత్తుల శ్రీనివాస్‌, వేముల రవి, అశోక్‌రెడ్డి, కిషన్‌ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.  కిలో మీటర్లు, కాలం చెల్లిన బస్సులు, ఉద్యోగ భద్రత, బస్సులకు సరైన స్పేర్‌పార్ట్స్‌ లేకపోవడం, వేతన సవరణ తదితర సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. 


logo