గురువారం 04 జూన్ 2020
Warangal-rural - Feb 19, 2020 , 03:09:11

జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్లు

జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్లు

సంగెం  :  రూరల్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ డైరెక్టర్‌గా నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు ఎన్నికయ్యారు.  మంగళవారం వరంగల్‌రూరల్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఎన్నికల కోసం 12 మంది డైరెక్టర్లుగా ఎన్నికల అధికారి ఆర్డీవో మహేందర్‌జీకి నామినేషన్‌ అందజేశారు.  ఇందులో 12 మంది డైరెక్టర్లకు గాను 12 మంది మా త్రమే  సింగిల్‌ నామినేషన్లు దాఖలు చేశారు.  మొత్తం అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 24న  జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మెన్‌ ఎన్నిక జరుగనుంది.

సొసైటీ చైర్మెన్‌గా నిమ్మగడ్డ ?

 రూరల్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ కొత్తగా ఏర్పడింది. దీని ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు కాగా అవి సింగిల్‌ నామినేషన్లు కావడంతో 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  దీంతో ఈ నెల 24న జరుగనున్న చైర్మన్‌ ఎన్నిక కోసం నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావును ఏకగ్రీవంగా డైరెక్టర్లు ఎన్నుకోనున్నట్టు సమాచారం.  జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీకి తొలి చైర్మన్‌గా నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు కానున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌గా ఎన్నికైన నిమ్మగడ్డకు జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, కందకట్ల నరహరి, కాపులకనపర్తి సొసైటీ చైర్మన్‌  సంపత్‌,  టీఆర్‌ఎస్‌  మండల పార్ట్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శుభాకాంక్షలు తెలిపారు. 

రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా డైరెక్టర్లుగా 

సారంగపాణి, రాజేశ్వరప్రసాద్‌..?

పరకాల టౌన్‌  : రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిలా ్లడైరెక్టర్లుగా పరకాల పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు బండి సారంగపాణి, ప్రముఖ డాక్టర్‌ పీరాజేశ్వరప్రసాద్‌ ఎన్నికకానున్నారు. రెడ్‌ క్రాస్‌ డైరెక్టర్ల నియామకానికి గాను  ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం  నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. నామినేషన్ల సమయం ముగిసే సమయానికి సింగిల్‌ నామినేషన్లు మాత్రమే దాలయ్యాయి. కాగా వీరిని రెడ్‌క్రాస్‌ సొసైటీ డైరెక్టర్లుగా అధికారికంగా గురువారం ప్రకటించనున్నారు. 

  డైరెక్టర్‌గా బుచ్చిరెడ్డి ఏకగ్రీవం 

 ఆత్మకూరు :  మండలంలోని కటాక్షపురం గ్రామానికి చెందిన దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి మంగళవారం రెడ్‌ క్రాస్‌ డైరెక్టర్‌గా ఏకగ్రీవం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలంలోనిప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


logo