హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 31: రాష్ట్రంలోని గడపగడపకూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న పథకాలే పార్టీని గెలిపిస్తాయని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ మంగళవారం ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. డివిజన్లో పెద్దఎత్తున మహిళలంతా కలిసి వినయ్భాసర్కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వినయ్ భాసర్ మాట్లాడుతూ ఎకడికెళ్లినా ప్రజా ఆశీర్వాద యాత్రలో ప్రజల ఆదరణ చూసి ఈ సారి 50 వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు.పదేళ్లలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయని, అవే గెలిపిస్తాయన్నారు.
ఎన్నికల సమయంలో వేరే పార్టీవాళ్లు వస్తారని, ఎన్నికలు ఉన్నా, లేకున్నా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా ఏ సమస్య వచ్చినా అండగా ఉన్నానన్నారు. కరోనా కష్టకాలంలో ఇంటింటికీ తిరిగానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వరదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినా కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, వలస పక్షుల వలే ఎన్నికలు వచ్చినప్పుడే ఇకడికి వస్తారని, కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నన్నే మీరు ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గులాబీ జెండా అండగా ఉన్నన్ని రోజులు ప్రజలకు ఎలాంటి కష్టాలు రావన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత మరిన్ని పథకాలు వస్తాయన్నారు. తెలంగాణ పథకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లు సాధించాలని చూస్తున్నారన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, తెలంగాణను అభివృద్ధి చేసే పార్టీనే ఆదరించాలని కోరారు.
గ్రేటర్ 6వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉస్మాన్ ఆధ్వర్యంలో 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి చీప్ విప్ దాస్యం వినయ్ భాసర్ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎన్నికల డివిజన్ ఇన్చార్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ చెన్నం మధు, మాజీ కార్పొరేటర్ మిర్యాల్‌కార్ దేవేందర్, ఓరం ప్రదీప్, కొండయ్య, అనురాం, కొత్తూరు జాక్ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.