నర్సంపేట ఐఎంఐ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్ రెడ్డి
కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు
నర్సంపేట, ఆగస్టు 7 : తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివా రం బిట్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులతో నర్సంపేటలోని పావని నర్సింగ్ హోంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని తల్లిపాల విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమం లో బిట్స్ చైర్మన్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భానురేఖ, సెక్రటరీ రాజేశ్వర్‌రెడ్డి, వీ నారాయణ, సురేశ్, మమత, మనీష పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటలోని అంగన్వాడీ 4వ కేంద్రం పరిధిలో తల్లిపాలపై గైనకాలజిస్ట్ నవత పాల్గొని అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, సీడీపీవో రాధిక, ఏసీడీపీవో ఝాన్సీ, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీలత, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత, వాసం కరుణ, శ్రీలత, రాజమణి, సునీత, అంగన్వాడీ టీచర్ నల్లా భారతి తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట : వర్ధన్నపేట సీహెచ్‌సీలో ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూపారాణి ఆధ్వర్యంలో తల్లులకు ముర్రుపాల ప్రా ముఖ్యత వివరించారు. వివిధ గ్రామాల అంగన్వాడీలతో కలిసి అవగాహన కల్పిం చారు. బిడ్డకు ముర్రుపాలు ఇస్తే రోగనిరోధకశక్తి పెరగుతుందన్నారు. కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు మాధవి, నేరెల్లి భారతి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల : పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సివిల్ దవాఖానలోని ప్రసూతి విభాగంలో మహిళలకు తల్లి పాల ప్రాముఖ్యతను సీడీపీవో భాగ్యలక్ష్మి వివరించా రు. కార్యక్రమంలో సూపర్ వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఆత్మకూరు మండలంలో..
ఆత్మకూరు : మండలంలోని చౌళ్లపల్లి, హౌసుబుజుర్గు, కటాక్షపురం, కామారం, నీరుకుళ్ల గ్రామాల్లో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్వాడీ టీచర్లు సుమలత, జమున ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
సింగరాజుపల్లిలో..
దామెర : మండలంలోని సింగరాజుపల్లిలో అంగన్వాడీ టీచర్లు రాణి, వాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎన్ఎం స్వరూప పాల్గొన్నారు.
కొత్తగట్టు సింగారంలో..
శాయంపేట : మండలంలోని కొత్తగట్టుసింగారం అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయురాలు కరుణ అవగాహన సదస్సు నిర్వహించారు. అంగన్వాడీ టీచ ర్లు, తల్లులు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
ధర్మారంలో..
గీసుగొండ : మండలంలోని గ్రేటర్ 15వ డివిజన్ ధర్మారం గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు మేక అనితాకుమారి అవగాహన కల్పించారు. సూపర్వైజర్లు ఉమాదేవి, లలిత, రాధిక, ప్రమీల, రేణుక, విజయ, జ్యోతి పాల్గొన్నారు.