e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జనగాం వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యం

వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యం

ఆత్మకూరు, జూలై 4: వ్యవసాయాన్ని పండుగ చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన క్లస్టర్‌ రైతు వేదిక భవనాన్ని ప్రా రంభించి, హెల్త్‌ సబ్‌సెంటర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స ర్పంచ్‌ అర్షం బలరామ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. దళిత సాధికారత పథకం దేశానికే ఆదర్శమన్నారు. సమావేశంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకన్న, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, వైస్‌ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు కొరె లలిత, రంపీసా మనోహర్‌, మచ్చిక యాదగిరి, ఎంపీటీసీలు అర్షం వరుణ్‌గాంధీ, మందపల్లి మమత, పీఏసీఎస్‌ చైర్మన్‌ కంది శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అంబాటి రాజస్వామి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ ఎనకతళ్ల రవీందర్‌, గ్రామ కోఆర్డినేటర్‌ తాటిపర్తి రంగారావు, పోతురాజు రా జు, ఎంపీడీవో నర్మద, పరకాల ఏడీఏ రవీందర్‌, మండల ఏవో యాదగిరి, విస్తరణ అధికారులు మానస, శ్రీకాంత్‌, సౌమ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, మండల ప్రధా న కార్యదర్శి రవియాదవ్‌, నాయకులు మానగాని సాంబమూర్తి, ఎన్నపురెడ్డి రాజిరెడి, కాకాని శ్రీధర్‌, అర్షం మధుకర్‌, భిక్షపతి, కక్కెర్ల రాజు, మార్క రజినీకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
పరకాల: పట్టణంలో చేపట్టిన అభివృద్ధి, మిషన్‌ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనిత, వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌రెడ్డి, కమిషనర్‌ తిరునహరి శేషాంజన్‌స్వామి, మున్సిపల్‌ ఏఈ వంశీ కృష్ణ, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
రాయితీలను వినియోగించుకోవాలి
దామెర: ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని యువత తమ నైపుణ్యాలతో రాష్ట్ర పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ల్యాదెళ్లలో అన్నపూర్ణ రైస్‌ మిల్లును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుక్క శ్రావణ్య, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, ఎంపీపీ కాగితాల శంకర్‌, జడ్పీటీసీ గరిగె కల్పన, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ బిల్లా రమణారెడ్డి, కుడా డైరెక్టర్‌ ఎన్కతాళ్ల రవీందర్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి పున్నం సంపత్‌, బీ అశోక్‌, ఎం రాజు, ఎం కర్ణాకర్‌, నాగరాజు, కే శ్రీధర్‌, సీహెచ్‌ రవి, కుమారస్వామి పాల్గొన్నారు.
పల్లెల్లో ‘ప్రగతి’ పరుగులు
నడికూడ: రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కౌకొండలో రూ. 9లక్షలతో నిర్మించే సైడ్‌ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సర్పంచ్‌ మేకల రమేశ్‌, ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ కోడెపాక సుమలత కరుణాకర్‌, ఎంపీటీసీ మేకల సతీశ్‌, డీఈ, ఏఈ, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement