మరిపెడ, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో వార్ వన్‌సైడ్ కానున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ జోస్యం చెప్పారు. మున్సిపల్ కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకు డు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో జరిగిన ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయన్నారు. ఆత్మరక్షణ పేరుతో అస్తుల రక్షణకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఉప ఎన్నికకు కారణమయ్యాడని ఆరోపించారు. హుజూర్నగర్ ఫలితమే హుజూరాబాద్‌లోనూ పునరావృతం కానున్నదని దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబం ధు పథకం తెలంగాణలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపనున్నదని అన్నారు. ఇంటింటికీ రూ.10 లక్ష లు అందజేస్తూ దళితులను వ్యాపారులుగా మార్చే ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. కేసీఆర్ ఆలోచన ప్రభుత్వానికి చిరస్థాయి కీర్తిని అందించనున్నదని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు చేయనుండగా, పైలట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌లో సీఎం అధికారికంగా ప్రారంభించారని చెప్పారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న దళితు లు నేటి నుంచి యజమానులుగా మారనున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట కురవి జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ నాయకులు షేక్ అఫ్జల్, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, పాదూరి శ్రావణ్‌రెడ్డి, శ్రీకాంత్ నాయక్, నర్సింహారెడ్డి, పానుగోత్ రాంలాల్, గంధసిరి అంబరీష, వల్లూరి కృష్ణారెడ్డి, కాలం రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు నూకల అభినవ్‌రెడ్డి, బోడ శ్రీను, భరత్ తదితరులు పాల్గొన్నారు.