తొర్రూరు/ హన్మకొండ చౌరస్తా, ఆగస్టు 6: ‘తెలంగాణ ఎట్లుండాలో కలలుగన్న జయశంకర్ సార్ గిప్పుడు బతికుంటే మస్తు సంబురపడేది.. ఆయన కోరుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ముందుకు నడుపుతున్నడు’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్ పార్కు(ఏకశిలా పార్కు)లో మంత్రి ఎర్రబెల్లి, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, హరిత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ యాదవరెడ్డి సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడుతుంటే జయశంకర్ సార్ వెన్నుతట్టి ప్రోత్సహించారని అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జయంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. నాడు తాను టీడీపీలో ఉన్న సందర్భంలో ఎలాగైనా చంద్రబాబునాయుడిని ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా తీర్మానాన్ని ఇప్పించాలని తనకు చెప్పారని, ఆయన మాటలను వేదవాక్కుగా భావించి లేఖ తెచ్చి ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. తన తండ్రితో జయశంకర్ సార్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా చదువు కోసం రెండు నెలల పాటు ఆయన ఇంట్లోనే ఉన్నానని, అప్పుడే ఆయన ప్రభావం తనపై పడిందని చెప్పారు. సార్ పేరును ఎల్లవేళలా గుర్తుంచుకునేవిధంగా భూపాలపల్లి జిల్లాను జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా, అగ్రికల్చర్ యూనివర్సిటీని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినట్లు తెలిపారు.
హన్మకొండలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. జయశంకర్ సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు.
హన్మకొండలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ దత్తపుత్రుడు బ్రహ్మం కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ మోహన్‌గాంధీ నాయక్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, తిరుణహరి శేషు, చీకటి ఆనంద్, జనార్దన్‌గౌడ్, నలుబోల సతీశ్, పులి రజినీకాంత్, టీఎన్జీవోస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్యదర్శి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి రాజేశ్, కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రాజేశ్‌కుమార్, ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, సలీం, తొర్రూరులో జయశంకర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దేవరకొండ కృష్ణప్రసాద్, సిరికొండ విక్రమ్‌కుమార్, సురేశ్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఆర్డీవో రమేశ్, డీఎస్పీ వెంకటరమణ, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ప్రతినిధులు దేవరకొండ శ్రీనివాస్, చెన్నోజు విజయ్‌కుమార్, సోమ సత్తయ్యచారి, కుషాల్, రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు.