వరంగల్, నవంబర్ 1: విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. మీర్పేట్ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న అదనపు కమిషనర్ నాగేశ్వర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. కమిషనర్ ప్రావీణ్యతో కలిసి అదనపు కమిషనర్ నాగేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా బల్దియా ఉద్యోగులతో సత్సంబంధాలతో విధులు నిర్వర్తించారన్నారు. విధి నిర్వహణలో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చి తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకున్నారన్నారు. ఆయన భవిష్యత్‌లో మరింత పేరు గడించాలని ఆకాంక్షించారు. అనంతరం బల్దియాలోని వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డి, సీహెచ్‌వో సునీత, పీఆర్వో ఆయూబ్ అలీ, సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, డీఎఫ్‌వో కిశోర్, కార్యదర్శి విజయలక్ష్మి, పన్నుల అధికారి శాంతికుమార్, బల్దియా జేఏసీ అధ్యక్షులు గౌరీశంకర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేయాలి
గ్రేటర్‌లోని పైప్‌లైన్ లీకేజీ, రోడ్ల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్లో ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వందల సంఖ్యలో పైపులైన్ లీకేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టాలని ఆదేశించారు. బల్దియా, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ నెల చివరి వరకు ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా అందాలన్నారు. శివనగర్, పుప్పాగుట్ట, బోడగుట్ట పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులను తొలగించాలన్నారు. డీజిల్ కాలనీలోని తాగునీటి సమస్య పరిష్కారానికి జాతీయ రహదారుల శాఖ అధికారులతో సంప్రదించి వెంటనే పైప్‌లైన్ వేయాలని పబ్లిక్ హెల్త్ అధికారులను అదేశించారు. సమావేశంలో ఈఈలు శ్రీనివాస్, శ్రీనివాస రావు, రాజ్‌కుమార్, డీఈలు సంతోశ్‌బాబు, రవికుమార్, రవికిరణ్, నరేందర్, శ్రీనాథ్‌రెడ్డి, నస్రత్ జహన్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో కోతుల బెడద ఉండొద్దు..
నగర ప్రజలకు కోతుల బెడద నుంచి ఉపశమనం కలిగించాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పట్టుకున్న 171 కోతులను ప్లానిటోరియం వద్ద బోన్కేజ్లో ఉంచారు. సోమవారం వీటిని పరిశీలించిన ఆమె మాట్లాడుతూ పట్టుకున్న కోతులకు ఆహారం అందించాలని సూచించారు. వీటన్నింటిని ఏటూరునాగారం అడవి ప్రాంతానికి తరలించాలన్నారు. నగరంలో 5 ప్రాంతాల్లో బోన్కేజ్లను ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. కార్యక్రమంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, బల్దియా పశువైద్యాధికారి గోపాల్‌రావు, శ్యామ్‌రాజ్