హనుమకొండ, ఏప్రిల్ 26 : విద్యార్థు ల జీవితాలతో కాంగ్రె స్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫీజు పోరుబాట’కు సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్వీ హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేశ్యాదవ్తో కలిసి వడ్డేపల్లి నివాసం లో ఆయన ఆవిషరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. రీయింబర్స్మెంట్ నిధులు విడుదలకాక పై చదువుల కోసం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కో ఆర్డినేటర్ రఘుపతి, నాయకులు వీరస్వామి, కోరపెల్లి రాజేష్, రాసూరి రాజేష్, ఐలోని, అభిషేక్ పాల్గొన్నారు.