ఇండోర్ స్టేడియంలో మ్యాట్స్ ఏర్పాటుకు కృషి
ఎమ్మెల్సీ బండా ప్రకాశ్
ఆటలకు ఆయువుపట్టు వరంగల్
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
ముగిసిన తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
విజేతలకు బహుమతుల ప్రదానం
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 21: వరంగ ల్లో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తామని, ఈమేరకు వంద ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి కోరినట్లు ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న టోర్నమెంట్ ముగిసింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, సిరికొండ మధుసూదనచారి, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి పాల్గొని విజే తలకు బహుమతులు ప్రదానం చేశారు. అనం తరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రకాశ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై భారంపడకుండా స్పోర్ట్స్ విలేజ్ నిర్మించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులు, అసోసియేషన్లు, సమష్ట కృషి ఎంతో అవసరమన్నారు. కరోనా కాలంలో నేరుగా క్రీడలను వీక్షించేందుకు వీలు లేకపోవ డం, మళ్లీ ఇప్పుడు తిలకించేందుకు అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటా క్రీడలు నిర్వహిస్తూ అందరికీ గౌరవమి స్తున్న అసోసియేషన్‌ను ఆయన అభినందించారు. జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో మ్యాట్స్ ఏర్పా టుకు కృషిచేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ ఈ కాలంలో పిల్లలు ఆటలకు దూరమై సెల్ఫోన్లకు ఆకర్షితులవుతున్నారని 50, 40 వయస్సులోనూ అద్భుతంగా ఆడారన్నారు. ఇండోర్ స్టేడియానికి ఎమ్మెల్సీ కోటా కింద మ్యాట్స్ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. ఆటలకు వరంగల్ ఆయువుపట్టు అని, క్రీడాకారులు నగర కీర్తిని చాటిచెప్పాలని మధుసూదనాచారి కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్యాడ్మింటన్ క్రీడాకా రులు పోటీల్లో పాల్గొని తమ అత్యుత్తమ ప్రతిభ చూపారని, మూడు ఈవెంట్లలో మెన్స్, 40ప్లస్, 50ప్లస్ డబుల్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ పవన్‌కుమార్, కోశాధికారి గడ్డం కేశవమూర్తి, తమ్మడపల్లి రాజు, వైవీ రాజేందర్, పోరిక విజయ్ కుమార్, టి.వేణు, విక్రమ్‌రెడ్డి, కోమాకుల మధు కర్, అంపైర్లు కొమ్ము రాజేందర్, శ్యామ్‌కుమార్, కృష్ణవేణి, భాస్కర్, అరుణ్, ప్రణయ్, మహేశ్ పాల్గొన్నారు.
హోరాహోరీ పోటీలు..
రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 90 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులు, కోచ్‌లు, టెక్నీకల్ అఫీషియల్స్లు కలిపి మొత్తం 290 దాకా పా ల్గొన్నారు. బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగాయి. మూడు ఈవెంట్లలో నిర్వహించిన పో టీల్లో రెండో రోజు మెన్స్, 40ప్లస్, 50ప్లస్ డబు ల్స్‌కు జరిగిన ఫైనల్స్ ఉత్కంఠ రేపాయి. గెలుపు కోసం తీవ్రంగా పోటీపడ్డారు. అటు యాభై సంవ త్సరాలకు పైబడిన వారు సైతం పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ చాటడం విశేషం. కాగా మెన్స్ డబు ల్స్, 40ప్లస్ డబుల్స్‌లో సైతం సంపత్-షఫీ(జేఎన్ఎస్) విజేతలుగా నిలువడం విశేషం.
విజేతలు వీరే..
40ప్లస్ డబుల్స్ సుమంత్-షరీఫ్(జేఎన్ఎస్) వర్సెస్ సంపత్-షఫీ(వరంగల్ ఆఫీసర్స్ క్లబ్) బెస్ట్ ఆఫ్ త్రీగా తలపడగా (15-21, 21-19, 21-12) పాయింట్స్‌తో సంపత్-షఫీ జట్టు విజేతగా నిలిచింది.
50ప్లస్ డబుల్స్‌లో విజయ్‌కుమార్-సంపత్(జేఎన్ఎస్) వర్సెస్ సుధాకర్-రాజు(జేఎన్ఎస్) పోటీపడగా (21-13, 21-13) పాయింట్స్‌తో విజయ్‌కుమార్-సంపత్ విజేతగా నిలిచారు.
* మెన్స్ డబుల్స్‌లో శ్రీకాంత్-శివ(జీడబ్ల్యూఎంసీ వరంగల్ ఇండోర్ స్టేడియం) వర్సెస్ సంపత్-షఫీ(జేఎన్ఎస్) తలపడగా (21-11, 21-18) పాయింట్లతో సంపత్-షఫీ గెలుపొందారు.