కేసముద్రం, ఆగస్టు 24 : తెలంగాణ ఏర్పడకముందు పరిమిత సంఖ్యంలో ఉన్న ఏఈవోలు కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారి స్థాయికి తగ్గట్లుగా విధులు నిర్వర్తించే పరిస్థితులు ఏర్పడ్డాయి. మునుపెన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ నిధుల ఎక్కువగా కేటాయిస్తుండడంతో ఈ దిశగా అడుగులు పడ్డాయి. రైతులంతా ఒకచోట కూర్చొని సమస్యలపై చర్చించుకునేందుకు, ఈ సందర్భంగా వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు క్లస్టర్లవారీగా రైతు వేదికలను నిర్మించారు. ఈ వేదికలలో ఏఈవోలకు కార్యాలయాలను కూడా ఏర్పా టుచేశారు. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారులు నిత్యం పల్లెల్లో అందుబాటులో ఉంటూ అన్నదాతలకు విలువైన సాగు సలహాలు ఇస్తున్నారు. వీటిని వినియోగించుకొని ఎందరో రైతులు సిరులు పండించుకుంటున్నారు.
ఏఈవోల సహకారం ఇలా..
రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, మద్దతు ధర, రాయితీ విత్తనాలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ఎలా లబ్ధి పొందాలో వివరిస్తున్నారు.
క్లస్టర్లవారీగా నియమితులైన ఏఈవోలు రైతు వేదికలో నిత్యం అందుబాటులో ఉంటూ సాగు మొదలుపెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చే దాకా రైతులకు తలలో నాలుకలా ఉంటున్నారు.
భూసారానికి అనుగుణంగా ఏయే పంటలు సాగు చేయాలో తెలియజేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల ఎంపికకు సంబంధించి సలహాలు ఇస్తున్నారు.
వాతావరణ పరిస్థితుల వల్ల పంటలకు వచ్చే చీడపీడలను పరిశీలించి పిచికారీ చేయాల్సిన మందులను సూచిస్తున్నారు.
సస్యరక్షణ చర్యలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించడంతో పాటు సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు రైతులకు సహకరిస్తున్నారు.
పంట ఉత్పత్తులను మద్దతు ధరకు విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నారు.
సంతోషంగా ఉంది..
రైతులకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నెల్లికుదురు మండలం నైనాల. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే ఇష్టం. అందుకే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు తీసుకున్నా. ఆ త ర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వ డంతో నాకు ఏఈవో జాబ్ వచ్చింది.
రైతులకు సేవ చేయడం అదృష్టం
రైతు కుటుంబంలో పుట్టిన నాకు.. రైతులకు సేవ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. రైతు వేదికలో నిత్యం రైతులకు అందుబాటు లో ఉంటూ క్షేత్రస్థాయిలో పం టలను పరిశీలించి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నాం. మద్దతు ధర, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నా. దేశానికి అన్నంపెట్టే రైతుకు సేవ చేయడం గర్వంగా ఉంది.