ఖిలావరంగల్, అక్టోబర్ 12: యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరు ణ్‌జోషి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను మంగళవారం సీపీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారం భించారు. అలాగే క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే దిశగా వాలీబాల్ పోటీలను ఏర్పా టు చేశామన్నారు. క్రీడల వల్ల యువతలో క్రమశిక్షణ అలవ డుతుందన్నారు. అలాగే పోలీసు విభాగం ఎలా పనిచేస్తుంద నే దానిపై యువత అవగాహన కలిగి ఉండాలన్నారు. కమిష నరేట్ పరిధిలో చదువుకున్న యువతను ప్రోత్సహించే దిశ గా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రానున్న రో జుల్లో పోలీస్ నియామకాల సందర్భంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో యువత రాణించేందుకు త్వరలో ఎంపిక అనం తరం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, క్రీడల నిర్వహణకు కృషి చేసిన మామునూరు డివిజన్ పోలీసులు అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంక టలక్ష్మి, టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఏఆర్ అదనపు డీసీపీ భీంరావు, మామునూరు, వర్ధన్నపేట ఏసీపీలు నరేశ్ కుమార్, రమేశ్, ఏఆర్ ఏసీపీ నాగయ్య, పర్వతగిరి, గీసు గొండ, మామునూరు ఇన్స్పెక్టర్లు విశ్వేశ్వర్, వెంకటేశ్వర్లు, రమేశ్, ఐనవోలు, సంగెం, పర్వతగిరి, ఎస్సైలు భరత్, భా స్కర్‌రెడ్డి, నవీన్‌కుమార్, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల యా జమాన్యం రాఘవేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డితోపాటు పోలీసు సిబ్బంది, పీఈటీలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.