ఐనవోలు/హసన్‌పర్తి, ఆగస్టు 17: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని పున్నేల్ క్రాస్ సమీపంలో నిర్వహించిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి మహిళా సంఘా ల సభ్యులకు వడ్డీ వాపస్ చెక్కులు, బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేశారు. 785 సంఘాలకు రూ.3.65కోట్ల విలువైన వడ్డీ వాపస్ చెక్కులు, 104 సంఘాలకు రూ.6 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సం క్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. కొత్తగా ఏర్పడిన ఐనవోలు మండల కేంద్రంలో మహిళా సం ఘాల కోసం మండల సమాఖ్య భవనం, ప్రతి గ్రా మంలో గ్రామైక్య సంఘాలకు వీవో భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్రావు పుట్టిన రోజు సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, ఆలయా కమిటీ చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, ఎంపీడీవో వెంకటరమణ, ఎన్ఆర్ఎల్ఎం అధికారి తక్కళ్లపల్లి రవీందర్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి మండల కేంద్రంలోని కేఎల్ఎన్ పంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ 581సంఘాలకు రూ.3.44 కోట్ల వడ్డీలేని రుణాలు, 81 సంఘాలకు స్వయం శక్తి పథకం ద్వారా రూ.4.88 కోట్లు రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీ కేతపాక సునీత, వైస్ ఎంపీపీ రత్నాకర్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, జడ్పీటీసీ సునీత, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.