హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాల్సిందేనని బీఆర్ఎస్ హ నుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. జాతీయ ఓబీసీ ప్రజా సంఘాల జేఏసీ ఆ ధ్వర్యంలో బీసీల హకుల కోసం హనుమకొండలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా దాస్యం మాట్లాడుతూc మ్యాని ఫెస్టోలో బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో రూ.9వేల కోట్లు కేటాయించి అన్యాయం చేసిందని అన్నారు.
42 శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేయాలని వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. బీసీల హకుల సాధన కోసం పోరాటమే మార్గమని అన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తిరునహరి శేషు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమయ్య, నాగపురి రాజుమౌళిగౌడ్, బీజేపీ నా యకులు ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్, విజయబాబు, సాంబమూర్తి, వీరస్వామి, రమే శ్, గడ్డం కృష్ణయ్య, రాములు, బీసీ విద్యార్థి నాయకులు గొల్లపల్లి వీరస్వామి, మాచర్ల శరత్చంద్ర, నితిన్, పొలంపల్లి రామ్మూర్తి, వేణుమాధవ్, దారబోయిన సతీశ్, వీర బోయిన తిరుపతి, ప్రశాంత్, ఎల్ రాజగోపాల్, శ్రీనివాస్, మహేశ్వరరావు, శంకర్, నారాయణ, సాంబమూర్తి, శ్రీధర్, వెంకన్న, భద్రయ్య, అరవిందాచారి, కృష్ణమురళీ యాదవ్, రాజేందర్‌గౌడ్, కృష్ణ సుధాకర్, విజయ్‌కుమార్ గౌడ్, గొర్రెల ఐలే శ్‌యాదవ్, మేకల కృష్ణయ్య, పులి రజినీ కాం త్, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, గౌరీభాసర్, రవీం దర్, పద్మ, కేఆర్ చారి, ఉజ్వల్‌కుమార్ గౌడ్, నవీన్‌కుమార్, తిరుపతి పాల్గొన్నారు.