కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం కొ విడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లను సి ద్ధం చేశారు. ఒక్కో హాల్లో ఏడు చొప్పున మొ త్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌పై ముగ్గురు సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటు న్నారు. 22 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి రౌండ్‌కు అర గంట సమయం పడుతుందని చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తో కౌంటింగ్ మొదలు కానుంది. 753 పోస్టల్ బ్యాలెట్లు పోలవగా, వీటిని అర గంటలో లెక్కించి 8.30కి ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కలు తీస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తారు. ఒక్కో రౌండ్‌కు అర గంట సమయం పడుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు 11 గంటల సమ యం పట్టవచ్చు. అంటే రాత్రి 8 గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
మొదట హుజూరాబాద్ ఓట్లే..
ఓట్ల లెక్కింపు మొదట హుజూరాబాద్ మండ లంలోని పోతిరెడ్డిపేట బూత్ నంబర్-2 నుంచి ప్రారంభిస్తున్నారు. మండలంలోని 14 గ్రామాల తర్వాత పట్టణ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట తర్వాత చివరగా కమలాపూర్ మండల ఓట్లను లెక్కించ నున్నారు. ఈ మండలంలోని శంభునిపల్లి బూత్ ఓట్లను చివరగా లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు.
ప్రతి రౌండ్‌కు ఫలితాల వెల్లడి
కౌంటింగ్ ఫలితాలను రౌండ్ల వారీగా వెల్ల డించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు హాళ్లలో ఏర్పాటు చేసిన 14 టేబుళ్లపై ఎవ రికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది లెక్కిస్తారు. అనం తరం లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్లోని స్లిప్‌లను పరిశీలిస్తారు. వాటికి అను బంధంగా ఉన్న బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లలో ఉన్న ఓట్లు వీవీ ప్యాట్స్‌లోని స్లిప్పులతో సరి పోతున్నాయా లేదా పరిశీలించాక ఫారం 17సీ ద్వారా రిటర్నింగ్ అధికారి ప్రతి రౌండ్‌కు ఒకసారి ఫలితాలను విడుదల చేస్తారు.
ఉదయం 6 గంటలకే కౌంటింగ్ హాలుకు..
ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందితోపాటు అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ హాల్లో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతు న్నందున సిబ్బంది 6 గంటలకే రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఒక్కో అభ్యర్థి తరఫున ప్రతి టేబు ల్కు ఒక్క ఏజెంట్‌కు మాత్రమే అనుమతి స్తున్నా రు. అంటే ప్రతి అభ్యర్థి 14 మంది ఏజెంట్లను నియమించుకునే అవకాశం కల్పించారు.
నిఘా నీడలో కౌంటింగ్ కేంద్రం
కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు మూడంచెల నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం ము గిసిన గత నెల 27 నుంచి ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఫలితాల వెల్లడికి ఆలస్యం తప్పదా?
ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉం డడం, పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో తుది ఫలితాలు వెల్లడికి ఆలస్యం తప్పేలా లేదు. ఒక్కో రౌండ్‌కు అర గంట చొప్పు న సమయం తీసుకున్నా 11 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల కు మాత్రమే అవకాశం ఉంటుంది. 30 మంది అభ్యర్థులకు 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కౌంటింగ్‌లో ప్రతి రౌండ్లో రెండు ఈవీఎంలోని ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి నెల కొన్నది. అంతేకాకుండి నిబంధన ప్రకారం ప్రతి రౌండ్లో ఐదు వీవీ ప్యాట్ స్లిప్‌లను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటలకుగాని తుది ఫలితాలు వెలువడే అవ కాశం లేదని అధికారులు చెబుతున్నారు.
కౌంటింగ్ సిబ్బందికి కలెక్టర్ శిక్షణ
ఉప ఎన్నిక కౌంటింగ్‌లో విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితర అధికారులు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌లో పాటించాల్సిన నియమ నిబంధనలకు వారికి వివరించారు. ఎక్కడా పొర పాటు జరగనీయవద్దని, సొంత నిర్ణయాలు తీసు కోవద్దని సిబ్బందిని హెచ్చరించారు. అను మానం వస్తే రిటర్నింగ్ అధికారి దృష్టికి తేవాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లతో మర్యాదగా వ్యవ హరించాలని సూచించారు.