నర్సంపేట, ఆగస్టు 30: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన నియోజకవర్గంలోని 77 మంది లబ్ధిదారులకు రూ. 26.76 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీలు పంపిణీ చేసి మాట్లాడారు. రోగాల బారిన పడి కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలా మారిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని అనేక జబ్బులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీల ద్వారా వైద్యం చేయించుకోవచ్చన్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న పేదలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ. 26 కోట్ల నగదు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నర్సంపేట నియోజకవర్గానికి అందిందన్నారు. థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ గ్రామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమెరికాలో స్థిరపడిన నర్సంపేట వాస్తవ్యుల సహకారంతో నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ సేవలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో ఉపసర్పంచ్ చేరిక
నెక్కొండ: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో మండలంలోని వెంకటాపురం ఉప సర్పంచ్ జాటోత్ లచ్చిరాం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు పెద్ది గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజన హరికిషన్, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ అపర్ణ-రవీందర్, మాజీ ఎంపీటీసీ భిక్షం, మాజీ ఉప సర్పంచ్ యాదగిరి పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: ఎమ్మెల్యే పెద్దిని నర్సంపేట ఆదర్శ మండల సమాఖ్య నూతన పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ఎమ్మెల్యేను కలిసిన వారిలో అధ్యక్షురాలు మోటూరి శ్వేత, ఉపాధ్యక్షురాలు ప్రియాంక, ప్రధాన కార్యదర్శి రజియా, సహాయ కార్యదర్శి అజ్మీరా పద్మ, కోశాధికారి శ్రీదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, నాయకులు గోపాల్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, న్యాయవాది రవి ఉన్నారు.
నల్లబెల్లి: మేడపెల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విడియాల రామారావు మృతి చెందగా, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పెద్ది వెంట టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బానోత్ సంగూలాల్, పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, కాకతీయ గురుకుల విద్యాసంస్థల అధినేత కమలాకర్‌రావు, సర్పంచ్‌లు చింతపట్ల సురేశ్, లావుడ్య తిరుపతి, నాయకులు రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌గుప్తా, విడియాల ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.