కాశీబుగ్గ, ఆగస్టు24: ‘పనిచేసేవారికే గుర్తింపు వస్తుంది.. కష్టపడే వారికే సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తారు.. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చరిత్రలోనే తొలి మహిళా చైర్ప ర్సన్‌గా దిడ్డి భాగ్యలక్ష్మిని నియమించడం అభినం దనీయం’ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ అన్నారు. మంగళవారం ఎను మాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డులో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్ర మాణ స్వీకారోత్సవం జరిగింది. ముందుగా ఎమ్మె ల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ కాలేరు కరంచంద్, సభ్యులు గోలి రాజన్న, పసునూరి సారంగపాణి, తుమ్మ రవీంద ర్‌రెడ్డి, గనిపాక విజయ్‌కుమార్, పట్టాపురం ఏకాంతంగౌడ్, పల్లెపాటి శాంతిరతన్‌రావు, కంది రవీందర్‌రెడ్డి, పిన్నింటి వెంకట్రావ్, మేయర్ గుండు సుధారాణితో కార్యదర్శి బరుపాటి వెంకటే శ్ రాహుల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు, పరకాల, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు. కష్టపడి పనిచేసిన వారిని సీఎం కేసీఆర్ గుర్తించి బాధ్యత లు అప్పగించారని అన్నారు.
చైర్పర్సన్ దిడ్డి భా గ్యలక్ష్మి ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ఆకాంక్షించారు. మార్కెట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తమ మార్క్‌ను చూ పించాలని అన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులతో పాటు వివిధ కార్మిక వర్గాలకు అండగా నిలువాల ని సూచించారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, వారికి 24 గంటలు విద్యుత్ సరఫరాతోపా టు రైతుబంధు పథకాన్ని అందిస్తున్నారని పేర్కొ న్నారు. గత ప్రభుత్వాల హయాంలో కంటే సీఎం కేసీఆర్ హయాంలోనే పంట దిగుబడి అధికంగా వస్తుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యవ సాయ రంగానికి మంచి డిమాండ్ ఉందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతి మండలానికి 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్య మున్న గోదాములు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అన్ని వర్గాల వారికి నామినేటెడ్ పదవు లు లభించాలని కేసీఆర్ సర్కారు హయాంలోనే రిజర్వేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దిడ్డి కుమారస్వామికి మార్కెట్ కమిటీ పరిధిలో మంచి అనుభవం ఉందని, వారితో రైతులకు మంచి రో జులు వచ్చినట్లేనని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రజ్వీనా సుల్తానా, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, డీడీఎం అజ్మీరా రాజునాయక్, డీఎంవో ప్రసాదరావు, వివిధ వ్యా పారులు, కార్మికులు పాల్గొన్నారు.