హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పారదర్శకతే లక్ష్యంగా గ్రూప్-1, గ్రూప్-2 నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఇప్పటికే కొత్త జోనల్ విధానంతో స్థానికులకే మెజారిటీ ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంది. ఇంటర్వ్యూల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేయాల న్న ప్రభుత్వ నిర్ణయంపై యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇప్పటివరకు ఇంటర్వ్యూలు ఉండేవి. గ్రూప్-1కు 100 మార్కులు, గ్రూ ప్-2కు సంబంధించి 75 మార్కులు ఉన్నా యి. సీఎం కేసీఆర్ యువతకు గుడ్ న్యూస్ చెప్పా రు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ఇతర గెజిటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలోని ఇంట ర్వ్యూ రౌండ్ రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ఏడుగురు సభ్యు లు అంగీకారం తెలిపారు. ఇకపై రాత పరీక్షల ఫలితాల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడం దాదాపు ఖాయమైంది. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హత మూడు సంవత్సరాలు సడలించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ఎస్సై పోటీ పరీక్షకు మూడు సంవత్సరాలు వయోపరిమితి పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఏజ్ దాటిపోయింది.. జాబ్ రాదనుకునేవారికి సీఎం కేసీఆర్ ప్రకటన ఆనందాన్ని నింపింది. 18 వేల పోస్టులు ఉన్న పోలీస్ శాఖలో ఈసారి పోటీ కూడా ఎక్కువగానే ఉండనుంది. మరింత కష్టపడి ఎస్సై జాబ్ సాధిస్తా.
-ఓ కార్తీక్, ఎస్సై అభ్యర్థి
గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేయడం నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో పాస్ అయినప్పటికీ ఇంటర్వ్యూలో రాకపోవడం చాలా బాధగా ఉంటుంది. గ్రూప్-1కు ప్రిపేరవుతున్నా. ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటున్నా. ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతున్నా.
-బీ ప్రతిమ, గ్రూప్-1 అభ్యర్థి