రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తుండడంతో చీఫ్ విప్ వినయ్భా స్కర్ ఆధ్వర్యంలో దాస్యం రంగశీల ఫౌండేషన్ యువతకు అండగా నిలుస్తోంది. వేల రూపాయలు పెట్టి శిక్షణ తీసుకోలేని ఉద్యోగార్థులకు ఉచితంగా ట్రైనింగ్ అందిస్తున్నారు. ఈ నెల 8 నుంచి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ప్రతి రోజూ కోచింగ్ ఇస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను మూడు నెలల పాటు కొనసాగించనున్నారు. 600 మందికి ఉచితంగా శిక్షణతోపాటు భోజనాలు పెడుతున్నారు. స్టటీ మెటీరియల్ కూడా ఇవ్వనున్నారు.
– హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 28
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు వివిధ శాఖల్లో ఏర్పడిన వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్ శాఖల్లో ఖాళీలకు ప్రకటన వెలువ రించింది. ఇంకా గ్రూప్-2, 3, 4తోపాటు డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్లు రానుండడంతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు ఉద్యోగార్థులు భారీగా తరలివస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల వారికి తక్కువ అవకాశాలు వచ్చేవి.. నూతన జిల్లాలు, జోన్లు ఏర్పాటు చేయడంతో స్థానికులకు అవకాశాలు పెరగడంతో నిరుద్యోగుల్లో ఉత్సా హాన్ని నింపాయి. ఈ క్రమంలో కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్‌తోపాటు టెట్‌కు ప్రిపేరయ్యేవారికి దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం..
నిరుద్యోగులు ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుదలతో ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఈసారి ఎలాగైనా జాబ్ సాధించాలని ప్రిపేర్ అవుతున్నారు. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చేందుకు కష్టపడి చదువుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ పొందుతున్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
పోటీ పరీక్షల కోసం ఇస్తున్న ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి సాధించుకున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. పేదలు వేల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకోలేని క్రమంలో వారికి చేయూతనందించి అండగా నిలిచేందుకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నాం. నిష్ణాతులైన అధ్యాపకులతో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉచితంగా శిక్షణ, మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తున్నాం.
– దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే
సౌకర్యాలు బాగున్నయ్..
ఉచిత శిక్షణలో అన్ని సౌకర్యాలు బాగున్నయ్. మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడే స్టడీమెటీరియల్ ఇవ్వనున్నారు. కానిస్టేబుల్, గ్రూప్-4కు ప్రిపేరవు తున్నా. నగరంలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది వస్తున్నారు. నిపుణులైన అధ్యాపకులతో క్లాసులు బోధిస్తున్నారు.
– గుగులోత్ స్వాతి, రాంనగర్
తెలుగు రాష్ర్టాల నుంచి ఫ్యాకల్టీ
నిరుద్యోగులకు వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆడిటోరి యంలో ఈనెల 8 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించాం. నిష్ణాతులైన తెలుగు రాష్ర్టాల ఫ్యాకల్టీతో పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ ఇప్పిస్తున్నాం. అధ్యాపకులు హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా వస్తున్నారు. సుమారు 600 మంది వరకు ఉద్యోగార్థులు ప్రతి రోజూ కోచింగ్ తీసుకుంటున్నారు. మూడు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ప్రతి రోజూ మధ్యాహ్నం ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. కోచింగ్ తీసుకున్నవారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తాం.
– లెక్కల రాజిరెడ్డి, ఉచిత శిక్షణ కోఆర్డినేటర్
పేదలకు మంచి అవకాశం..
పోలీస్ కానిస్టేబుల్ కావాలన్నది నా కల. పైసలుకట్టి శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి లేదు. ఆర్ట్స్ కళాశా లలో వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలోఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. ప్రైవేటు శిక్షణ తీసుకోవాలంటే వేల రూపాయలు కావాలి. ఈ శిక్షణ పేదలకు మంచి అవకాశం.
– జీ సాయికుమార్, వడ్డేపల్లి
అర్థమెటిక్ బాగా చెబుతున్నారు..
మాది ఇల్లంతకుంట. గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న. ఇప్పటికే మూడు నెలలు కోచింగ్ తీసుకున్న. ఇప్పు డు ఇక్కడ ఉచిత శిక్షణకు వస్తున్న. ఇందులో అర్ధమెటిక్ బాగా చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల ద్వారా మొదటిసారిగా ఇస్తున్న ఉచిత కోచింగ్‌ను ఎంతోమంది ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
– సీహెచ్ శివ, ఇల్లంతకుంట
గ్రూప్సే లక్ష్యం..
గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న. ఆ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పట్టుదలతో చదువుతున్న. హనుమ కొండలో ఉచితంగా శిక్షణ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇది నిరుద్యోగులకు ఎంతో ఉపయో గకరం. ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్యాకల్టీ చెప్పే క్లాసులు శ్రద్ధగా వింటున్నారు.
– అపర్ణ, హనుమకొండ