కరీమాబాద్, నవంబర్ 01: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించే నరకాసురవధ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉర్సు రంగలీల మైదానాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మన సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. కమిటీ కన్వీనర్ మరుపల్ల రవి పలు విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శతపతి శ్యాలరావు, కనుకుంట్ల రవి, వనం మధు, ఆవునూరి రామ్మూర్తి, వనం కుమార్, మరుపల్ల గౌతమ్, మాటేటి శ్యాం, మిరియాల ఆదిత్య, వంగరి సురేశ్, అన్న కుమారస్వామి, మరుపల్ల శివ, అంకం రామనాథం, తౌటం నర్సింహా, కొమ్ము రాజు, పోలం రంజిత్, కనుకుంట్ల శివసాయి, కంది అఖిల్‌సాయి తదితరులు పాల్గొన్నారు.