హనుమకొండ/మడికొండ, నవంబర్ 1: టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’ సభను దీక్షా దివస్ అయిన నవంబర్ 29న నిర్వ హించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాటి ఉద్యమ రథసార థిగా ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘దీక్షా దివస్’ నవంబర్ 29 తేదీన తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేత లు తమ అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌కు విన్న వించారు. స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే చేసుకు న్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థ లను నవంబర్ 29వ తేదీకి మార్చుకోవాలని సీఎం సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియజేయాలన్నారు.
ఈ నేపథ్యంలో నగర సమీపంలో సుమారు 10 లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహిం చి, విజయవంతం చేసేందుకు స్థలాలను అన్వేషి స్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని మడి కొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య వతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్, ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, హుజూరాబాద్ టీఆర్ఎస్ అ భ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పరిశీలించారు.