ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి
కిష్టాపురంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రాయపర్తి, ఫిబ్రవరి 21: దళితుల సమగ్రాభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కిష్టాపురం గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎంపిక చేసిన నేపథ్యంలో గ్రామంలోని దళితులు, సర్పంచ్ ఉప్పలమ్మ, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గట్టు నర్సింహ్మాచార్యుల సారథ్యంలో సోమ వారం గ్రామంలో దళితబంధు సంబురాలు-సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి మాట్లాడు తూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధిపైనే సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిం చారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కత్తి సుజా త, టీఆర్ఎస్ మండల నాయకులు పూస మధు, గారె నర్సయ్య, గబ్బెట బాబు, సంకినేని నవీన్‌కుమార్, కే సజ్జన్‌నాయక్, గుండె రామస్వామి, పెండ్లి వెంకన్న, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేత..
వాంకుడోత్ తండా గ్రామ పంచాయతీకి చెందిన వాం కుడోత్ నరేశ్‌కుమార్ ఇటీవల అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. కాగా, సీఎం సహాయ నిధి నుంచి రూ.40 వేలు మంజూరయ్యాయి. కాగా, ఆ చెక్కును ఎంపీపీ అనిమిరెడ్డి, గ్రామస్తుల సమ క్షంలో బాధిత కుటుంబానికి అందజేశారు.
సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన..
కిష్టాపురం, వాంకుడోత్ తండా, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కంలో భాగంగా నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల ని ర్మాణ పనులను ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్, రైతుబంధు సమితి మం డల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు పాల్గొన్నారు.