వర్ధన్నపేట, ఫిబ్రవరి 21: గ్రామాల్లో మౌలిక వసతులు క ల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి పేర్కొన్నారు. మండలంలోని బండౌతాపురంలో ఎంజీఎన్ ఆర్ ఈజీఎస్ ద్వారా మంజూరైన రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతులను కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, పార్టీ నాయకులు సాయికుమార్, చందర్ రావు, వేణు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
రాయపర్తి: మండలంలోని కేశవాపురం, బురహాన్‌పల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నూతనంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 39 పంచాయతీల పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు నూతనంగా సీసీ రోడ్లు, కాల్వల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ రంగుకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ము నావత్ నర్సింహ్మానాయక్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, మండల నాయకులు పూస మధు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు చిలుముల ఎల్లమ్మ యాకయ్య, సూదుల దేవేందర్‌రావు, ఎంపీటీసీలు బీ సంధ్యారాణి సోమనాథం, బీ స్వేత, ముత్తడి సాగర్‌రెడ్డి, మొలుగూరి పున్నమయ్య, రాజు, రాయారపు సారంగం, ఏ రమేశ్, జలగం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతన బోర్ పనులు ప్రారంభం..
చెన్నారావుపేట: మండలంలోని బోడ మాణిక్యంతండా లో శ్మశానవాటికలో నూతన బోర్ బావి పనులను ఎంపీ పీ బీ విజేందర్ ప్రారంభించారు. కార్య క్రమంలో సర్పం చ్ బోడ ఆనంద్, ఉపసర్పంచ్ బోడ శ్రీను, వార్డుసభ్యుడు లేకర్, దావీదు, మోహన్, పద్మ, ప్రశాంత్, బోడ రాజన్న, దేవ్‌సింగ్, రమేశ్ పాల్గొన్నారు.