గీసుగొండ, సెప్టెంబర్ 5: కార్యకర్తలే టీఆర్ఎస్కు పట్టుగొమ్మలని పార్టీ మండల అధ్యక్షుడు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి, విశ్వనాథపురంలో టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆదివారం కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయా గ్రామాల ఎన్నికల పరిశీలకులు తెలిపారు. విశ్వనాథపురం అధ్యక్షుడిగా గుగులోత్ రాజు, ప్రధాన కార్యదర్శిగా బాగాతి రాములు, ఉపాధ్యక్షుడిగా బరుపటి రవీందర్, సహాయ కార్యదర్శిగా స్వామి, కోశాధికారిగా జల్లెల రాజయ్య ఎన్నికయ్యారు. గంగదేవిపల్లి అధ్యక్షుడిగా ఎరుకల రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా వడిదల శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా రాజిరెడ్డి, కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా గోనె రవి, కోశాధికారిగా గోనె ఐలయ్య ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు కుడా డైరెక్టర్ వీరగోని రాజ్‌కుమార్, మండల కార్యదర్శి పూండ్రు జైపాల్‌రెడ్డి, నాయకులు గుర్రం రఘు, మాధవరెడ్డి, ముంత రాజయ్య, సర్పంచ్‌లు అంకతి నాగేశ్వర్రావు, గోనె మల్లారెడ్డి తెలిపారు. గంగదేవిపల్లిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు పాల్గొన్నారు.
గ్రేటర్ 16వ డివిజన్లో..
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్లోని జాన్‌పాక, కీర్తినగర్, ధర్మారంలో టీఆర్ఎస్ గ్రామ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల ఇన్చార్జి చింతం సదానందం తెలిపారు. జాన్‌పాక అధ్యక్షుడిగా ఎండీ సోహెల్, ప్రధాన కార్యదర్శిగా బొంత వెంకన్న, ఉపాధ్యక్షులుగా గోపు రాజన్న, అప్జల్, సంయుక్త కార్యదర్శిగా బొమ్మిశెట్టి రాజేశ్, కోశాధికారిగా రాజేశ్ ఎన్నికయ్యారు. కీర్తినగర్ కాలనీ అధ్యక్షుడిగా గోరుకంటి లక్ష్మణ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా మెండు కమలాకర్, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, బషీర్, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా చేరాలు, కోశాధికారిగా రాణి ఎన్నికయ్యారు. ధర్మారం అధ్యక్షుడిగా గాదె బాబు, ప్రధాన కార్యదర్శిగా వాసం మల్లేశం, ఉపాధ్యక్షులుగా రాజు, శ్రీనివాస్, గోనె రాజు, వీరస్వామి, సంయుక్త కార్యదర్శిగా జక్కుల రాజు, కోశాధికారిగా ఎలిగేటి శారదా కిష్టయ్య ఎన్నికయ్యారు. కార్పొరేటర్ సుంకరి మనీషాశివకుమార్, నాయకులు రాజయ్య, రమేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
మొండ్రాయి, గొల్లపల్లి కమిటీలు
టీఆర్ఎస్ మొండ్రాయి, గొల్లపల్లి గ్రామ కమిటీల ఎన్నికలు సమన్వయ కమిటీ సభ్యుడు కందకట్ల నరహరి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి. మొండ్రాయి అధ్యక్షుడిగా అనుముల ప్రతాప్, ఉపాధ్యక్షులుగా దేవులపల్లి రమేశ్, ఇండ్ల రవి, పరికి మోహన్, లెంకలపెల్లి రవి, ప్రధాన కార్యదర్శిగా పరికి యాకయ్య, కోశాధికారిగా చల్లా అరుణ, సంయుక్త కార్యదర్శిగా యార సంపత్, దేవులపెల్లి అభిరాజ్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా దుడ్డె ప్రశాంత్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలిగా యార సుగుణ, బీసీసెల్ అధ్యక్షుడిగా అనుముల యుగేంధర్, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా పరికి ప్రతాప్, గొల్లపల్లి అధ్యక్షుడిగా కన్నెబోయిన పెద్ద రాజు, ఉపాధ్యక్షుడిగా దాసరి రాజు, ప్రధాన కార్యదర్శిగా బండి రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా వేల్పుల రవి, కోశాధికారిగా ఎల్లబోయిన పుష్ప, యూత్ కమిటీ అధ్యక్షుడిగా బాబు రమేశ్, బీసీసెల్ అధ్యక్షుడిగా ఎల్లబోయిన రాజాలు, మహిళా అధ్యక్షురాలిగా ఎల్లబోయిన కల్పన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు బుక్క మల్లయ్య, వేల్పుల కుమార్‌యాదవ్, కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, ఉండీల రాజు, సర్పంచ్‌లు గూడ కుమారస్వామి, మేరుగు మల్లేశం, ఎంపీటీసీ కొనకటి రాణి-మొగిలి, మండల యూత్ నాయకులు పురుషోత్తం, పొడేటి ప్రశాంత్, పోశాల ప్రవీణ్, శంకర్, సుమన్, దుడ్డె ప్రశాంత్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.