ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి అభినందనల వెల్లువ
పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు
హనుమకొండ, ఫిబ్రవరి 21: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద ర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఆయనను నేరుగా కలి సి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపా రు. వీరిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీ హరి, డాక్టర్ బండా ప్రకాశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ కవిత, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మె ల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్నా యక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగుర్ల వెంకన్న, జడ్పీ చైర్మన్లు తదితరులున్నారు.