తొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవా త్మక మార్పులు తేవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పట్టుదలతో పనిచేసి ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం తొర్రూరులోని శ్రీనివాస గార్డెన్లో రాష్ట్ర ఆయిల్ ఫెడ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశిం చి మాట్లాడుతూ తొర్రూరు మండలం గుర్తూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌పామ్ సాగుచేస్తాన ని ప్రకటించి వారిలో ఉత్సాహం నింపారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా మూడేళ్ల పాటు 80శాతం సబ్సిడీ ఇచ్చేలా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అలాగే బ్యాంక్ నుంచి ఎకరానికి రూ.లక్షా 20 వేల రుణం, మూడేళ్ల పాటు రూ.32వేల సబ్సిడీ, డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. వరి సాగుతో భవిష్యత్‌లో కష్టాలు తప్పేలా లేవని, విపరీతమైన దిగుబడులతో ఎఫ్‌సీఐ బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితిలో లేదన్నారు.
ఇతర రాష్ర్టాల్లో ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1200కు మించి చెల్లించకపోగా మన రాష్ట్రంలో మాత్రం రూ.1800కు కొన్నామని గుర్తుచేశారు. అలా గే వరంగల్ పత్తికి దేశంలో మంచి గుర్తింపు ఉందన్నా రు. పెట్టుబడి తక్కువగా దిగుబడి అధికంగా, కూలీ ఖర్చులు తగ్గేలా పంటల సాగుపై దృష్టి సారించేందుకు ఆయిల్‌పామ్ సాగు ఎంతో ప్రయోజనకరంగా ఉం టుందన్నారు. మొక్క నాటిన మూడేళ్ల వరకు కాపాడుకుంటే చాలు 30ఏళ్ల పాటు మనకు దిగుబడి ఇస్తుంద ని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎకరాకు రూ. లక్ష తగ్గకుండా ఆదాయం సమకూరుతుందన్నారు. మరో 30ఏళ్ల వరకు ఆయిల్‌పామ్ సాగుకు ఢోకా లేద ని, రోజురోజుకూ మార్కెట్లో పామాయిల్ వినియో గం పెరిగిపోతున్నదని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలున్నాయని రైతులు కోరుకున్నన్ని సార్లు అవగాహ న సదస్సులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రు. ఊరికి కనీసం వంద ఎకరాలకు తగ్గకుండా ఆయిల్‌పామ్ సాగు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
హరిపిరాలలో 26 ఎకరాల్లో నర్సరీ..
ప్రభుత్వ సహకారంతో హరిపిరాలలో 26 ఎకరా ల్లో నర్సరీ ఏర్పాటు చేస్తున్నామని, గోపాలగిరిలో ఫ్యా క్టరీ కోసం స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటిన నాలుగేళ్ల నుం చి కాపు మొదలై 30ఏళ్ల వరకు నిరంతరం దిగుబడి వస్తుందని, ప్రతి వారం ఆదాయం పొందవచ్చన్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 50వేల ఎకరాల విస్తీర్ణంలో 10వేల మంది సాగు చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ అభిలాషా అభినవ్ మాట్లాడుతూ గోపాలగిరి, హరిపిరాలలో నర్సరీ, ఫ్యాక్టరీ కోసం ఆయిల్‌ఫెడ్‌కు భూములను బదలాయించామని చెప్పారు. తొర్రూరు, పెద్దవంగర మండలాలకు చెందిన 500 మంది రైతులకు నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో డీహెచ్‌ఎస్‌వో సూర్యనారాయణ, సైంటిస్ట్ ఎంవీ ప్రసాద్, ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, డీఏవో ఛత్రూనాయక్, డీపీవో రఘు, జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆలపాటి రాంచంద్రప్రసాద్, ఆర్డీవో రమేశ్, డీఎ స్పీ వెంకటరమణ, ఎంపీపీలు తుర్పాటి చిన్నఅంజ య్య, ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరాం జ్యోతిర్మయి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్లు అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, పాకనాటి సోమిరెడ్డి, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఆయిల్‌ఫెడ్ అధికారులు రాజశేఖర్‌రెడ్డి, సురేశ్, కుమార్‌యాదవ్, అరుణ్, వెలికట్ట సర్పం చ్ పుష్పలీల, ఎంపీటీసీ మల్లమ్మ, వైస్ ఎంపీపీ శ్యాం సుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, లయన్స్ క్లబ్ బాధ్యులు యాకూబ్, నవీన్, వెంకన్న పాల్గొన్నారు.