హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11 : హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 15 నుంచి సింథటిక్ ట్రాక్‌పై జరిగే నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ జేఎన్‌ఎస్‌ను మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మైదానంలో జరుగుతున్న పనులు వారు పరిశీలించారు. అనంతరంర ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, సీఎం కేసీఆర్ చొరవతోనే జేఎన్ఎస్లో సింథటిక్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు జిల్లాలోని పర్యాటక కేంద్రాలు సందర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మైదానం చుట్టూ మున్సిపల్ సిబ్బందితో అభివృద్ధి పనులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్‌రావు క్రీడల ఏర్పాట్ల గురించి వారికి వివరించారు.
స్టేడియాన్ని సందర్శించిన సాయ్ ఏడీ హిమబిందు
బెంగళూరు నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) అసిస్టెంట్ డైరెక్టర్ హిమబిందు శనివారం జేఎన్‌ఎస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలోని సింథటిక్ ట్రాక్‌ను ఆమె పరిశీలించి, ఈనెల 15 నుంచి 19వరకు జరిగే నేషనల్ అథ్లెటిక్స్ పోటీల అనుమతులు, సింథటిక్ ట్రాక్, పోటీల ఏర్పాట్ల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. వారి వెంట భారత అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచారి అవార్డు గ్రహీత నాగపురి రమేశ్, డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిలా అధ్యక్షుడు వరద రాజేశ్వర్‌రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీఈటీలు సాంబమూర్తి, రజినీకాంత్, వాసుదేవరావు, అథ్లెటిక్ కోచ్ శ్రీమన్నారాయణ ఉన్నారు.