వరంగల్ : అతివేగంగా వెళ్తున్న బైకులు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ పట్టణంలోని హంటర్ రోడ్డు జూపార్క్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు గాయడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఎంజీఎం దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.