సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 08, 2021 , 01:04:28

హైవేపై తాజా కూరగాయలు

హైవేపై తాజా కూరగాయలు

  • పండించిన చోటే రైతుల విక్రయం

ఆత్మకూరు, జనవరి7: తమ పొలాల్లో రైతులు కూరగాయలు సాగు చేసి సమీపంలోని జాతీయ రహదారిపై తాజాగా విక్రయిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో దూర ప్రాంతాల్లోని మార్కెట్లలోకి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వాహనాల ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌163 వెంట ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌, ఆత్మకూరు, కటాక్షపురం స్టేజీ వద్ద షెడ్లు వేసుకొని కూరగాయలు విక్రయిస్తున్నారు. బయట రేట్లకే తాజా కూరగాయలు లభిస్తుండడంతో వినియోగదారులు కూడా కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. బెండ, టమాట, మిర్చి, చిక్కుడు, మునగ, వంకాయ, బీరకాయ, క్యారెట్‌, బీట్‌రూట్‌, కోతిమీర, మెంతికూర, పాలకూర, తదితర కూరగాయలను అమ్ముతున్నారు. పం డించిన చోటే విక్రయిస్తుండడం వల్ల ప్రయాణికులు అగి కొనుగోలు చేస్తున్నారని, గిరాకీ కూడా బాగానే ఉన్నట్లు రైతులు  పేర్కొంటున్నారు.

VIDEOS

logo