బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Jan 08, 2021 , 01:04:40

అడవులను పునరుద్ధరించాలి

అడవులను పునరుద్ధరించాలి

  • ఫారెస్టు శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌జైస్వాల్‌ 
  • ములుగు జిల్లాలో పర్యటన

ములుగు, జనవరి8 (నమస్తే తెలంగా ణ), తాడ్వాయి, వెంకటాపూర్‌ :  ములు గు జిల్లాలో అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఫారెస్టు శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌(కంపా) లోకేశ్‌జైస్వాల్‌ అన్నారు. గురువారం ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌ శెట్టి అధ్యక్షతన ఫారెస్టు డెవలప్‌మెంట్‌ యాక్షన్‌ ప్లాన్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమం చేపట్టారు. అనంతరం లోకేశ్‌జైస్వాల్‌ పస్రా రేంజ్‌ పరిధి వెంకటాపూర్‌ మండలంలోని ఎల్లారెడ్డిపల్లె వెస్ట్‌ బీట్‌లో 200 హెక్టార్లలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులతోపాటు ఫొటో గ్యాలరీని పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మా మిడిగుడెంలో గడ్డిమైదానాన్ని ఆయన సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ములుగు కలెక్టర్‌ కృష్ట ఆదిత్య, వరంగల్‌ పీసీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌సురభీ, ఏఎస్పీ సాయిచైతన్య, ఐటీడీఏ పీవో హన్మంత్‌ జెండగే, ఎఫ్‌డీవోలు నిఖిత, గోపాల్‌రావు, వజ్రారెడ్డి, పస్రా రేంజ్‌ ఆఫీసర్‌ మాధవీశీతల్‌, వెంకటాపూర్‌ ఎఫ్‌ఎస్‌వో గౌతమి, ఎఫ్‌డీవోలు నవీన్‌, శోభన్‌ తదితరులున్నారు.

VIDEOS

logo