న్యూఢిల్లీ: అనేక దేశాల్లో ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నెలల్లో ఇది 11వది. 2024 ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్. 1850-1900 సంవత్సరాల్లోని ఏప్రిల్ నెలల్లో సగటు ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే, 2024 ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రత 1.58 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.
1991-2020 వరకు గల సంవత్సరాల్లోని ఏప్రిల్ నెలల్లో సగటు ఉష్ణోగ్రతలతో పోల్చుకుంటే, 0.67 డిగ్రీలు ఎక్కువ. 2016 ఏప్రిల్లో సగటు ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది, దీని కన్నా ఈ ఏడాది ఏప్రిల్లో 0.14 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.