శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-city - Nov 01, 2020 , 01:51:57

లక్ష దాటిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

లక్ష దాటిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

వరంగల్‌ : ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌కు గ్రేటర్‌ కార్పొరేషన్‌లో విశేష స్పందన వచ్చింది. శనివారం గడువు ముగిసే నాటికి గ్రేటర్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు లక్ష దాటాయి. ఇదే చివరి అవకాశం అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ప్రజలు ముందుకు వచ్చారు. చివరి రోజు రాత్రి 8 గంటల వరకు 1,00,176 దరఖాస్తులు వచ్చినట్లు గ్రేటర్‌ అధికారులు తెలిపారు. రాత్రి 12 గంటల వరకు సైట్‌ అందుబాటులో ఉంటున్నందున సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా గ్రేటర్‌కు రూ.10.31కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు.