శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-city - Oct 27, 2020 , 01:19:32

భక్తిశ్రద్ధలతో శమీ పూజలు

భక్తిశ్రద్ధలతో శమీ పూజలు

ఆకట్టుకున్న ‘రావణ వధ’

కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

అంతటా వాహన, ఆయుధ పూజలు

వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు 

కరీమాబాద్‌/మిల్స్‌ కాలనీ/పర్వతగిరి : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. కొన్నిచోట్ల ఉదయం, మరికొన్ని చోట్ల సాయంత్రం శమీ పూజలు భక్తిశ్రద్ధలతో సాగగా, ‘రావణ వధ’ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆయుధ, వాహన పూజలు, దర్శనాలతో దేవాలయాలు కిటకిటలాడాయి. ప్రజలు జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఒకరికొకరు జమ్మాకును పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సాయంత్రం పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. కమిషనరేట్‌, ఆయా జిల్లాల్లోని ఎస్పీ కార్యాలయాలు, ఠాణాల్లో ఆయుధ పూజలు చేశారు. వరంగల్‌ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానం, ఓసిటీలోని ఇండోర్‌ స్టేడియం, రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, తదితరులు పాల్గొని రావణ ప్రతిమకు నిప్పంటించారు. అదేవిధంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఎర్రబెల్లి కుటుంబసభ్యులతో కలిసి దసరా ఉత్సవాల్లో భాగంగా ఆయుధ పూజ నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు పూజలు చేశారు. రాష్ట్ర దివ్యాంగుల అభి వృద్ధి సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, శివునిపల్లి జంట పట్టణాల్లో దసరా వేడుకల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలోని తన స్వగ్రామంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ స్థానికులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దసరా సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా నైజాం నవాబు కాలం నాటి నుంచి గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా సర్పంచ్‌ అజ్మీరా బన్సీలాల్‌ నాయక్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత శోభాయాత్రను సోమవారం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ధర్మసాగర్‌ మండలంలోని శాయిపేట గ్రామంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి నవరాత్రి ముగింపు ఉత్సవంలో పాల్గొన్నారు.

కేసీఆర్‌తోనే పండుగలకు గుర్తింపు : మంత్రి ఎర్రబెల్లి 

సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ పండుగలకు గుర్తింపు లభించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రంగలీలా మైదానంలో జరిగే రావణవధ దేశంలోనే పెద్దదన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో వరంగల్‌ నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న రాజకీయ నాయకులకు పతనం తప్పదన్నారు. రంగశాయిపేట ప్రాం తంలో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా రంగలీలా మైదానంలో ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ ప్రాంతవాసిగా ఉత్సవ నిర్వహణకు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు, ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ మంజుల, కార్పొరేటర్లు మేడి ది రజిత, కత్తెరశాల వేణుగోపాల్‌, కేడల పద్మ, ఉత్సవ కమిటీ  అధ్యక్షుడు నాగపురి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి బండి కు మా రస్వామి, కోశాధికారి మండ వెంకన్నగౌడ్‌, ఉత్సవ కన్వీనర్‌ వొడ్నాల నరేందర్‌, ఉపాధ్యక్షులు వంగరి కోటేశ్వర్‌, మేడిది మధుసూదన్‌, వెలిదె శివ మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శులు వంచనగిరి సమ్మయ్య, గోనె రాంప్రసాద్‌, వొగిలిశెట్టి అనిల్‌ కుమార్‌, దామెరకొండ వెంకటేశ్వర్లు, నాగపూరి రంజిత్‌, కార్యదర్శులు సుంకరి సంజీవ్‌, బజ్జూరి వాసు, బొల్లం రాజు, ఎనగందుల సుధాకర్‌, పొగాకు సందీప్‌, పూదరి అజయ్‌, కమిటీ సభ్యులు నాగపూరి మహేశ్‌, మండ రాజు, గట్టు గోవర్ధన్‌, నాగపూరి కాళి, నాగపూరి సంతోష్‌, పొగాకు చిరంజీవి, నాగపూరి అశోక్‌, బిట్ల క్రాంతి, గట్టు రమేశ్‌, నాగపూరి నాగరాజు, బొల్లం మధు,  వలుస వినయ్‌, బొమ్మల్ల అంబేద్కర్‌, నరిగె శ్రీను, అక్తర్‌, బత్తిని రంజిత్‌, పార్వతి కృష్ణంరాజు, మీరిపెల్లి వినయ్‌, బైరి వంశీ, బోరిగం నాగరాజు, మోడెం రాజశేఖర్‌, రంగశాయిపేట ఉత్సవ సమితి అధ్యక్షుడు గుండు పూర్ణచందర్‌, ప్రధాన కార్యదర్శి దామెరకొండ కరుణాకర్‌, ఉత్సవ సమితి నాయకులు ముత్తినేని రామమూర్తి, పరికిపండ్ల రాజేశ్వర్‌రావు, మండల లక్ష్మయ్య, కన్నెబోయిన కుమార్‌, పార్వతి శంకర్‌, బజ్జూరి వీరేశం, కోట శ్రీధర్‌, పాకాల మనోహర్‌, పస్తం భిక్షపతి, రేణికుంట్ల ప్రవీణ్‌, ఆర్‌వైఎఫ్‌ ప్రతినిధులు కొట్టె వినయ్‌, శంకేశి కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.