శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 11, 2020 , 06:31:43

జంక్షన్‌కు నయా లుక్‌

జంక్షన్‌కు నయా లుక్‌

  • హన్మకొండ కొత్త బస్టాండ్‌ రోడ్డుకు మహర్దశ
  • రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మోక్షం
  •  ఫౌంటేన్‌, గార్డెన్‌, హైమాస్ట్‌ లైట్లతో ఆహ్లాదం 
  • రూ.9కోట్లతో అభివృద్ధి పనులు
  • వాహనదారుల్లో హర్షం 

  రెడ్డికాలనీ, సెప్టెంబర్‌ 10: హన్మకొండ న్యూ బస్టాండ్‌ జంక్షన్‌ నయా లుక్‌ సంతరించుకుంది. కొత్త బస్టాండ్‌ రోడ్డుకు మహర్దశ పట్టింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచు కోని రహదారికి మోక్షం కలిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వరంగల్‌ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ది. అందుకోసం రూ. వేల కోట్లు వెచ్చిస్తున్నది. ఇప్పటికే న్యూ బస్టాండ్‌ రోడ్డు జంక్షన్‌ సుందరంగా ముస్తాబైంది. తారు రోడ్డు వేస్తుండగా కొత్త శోభను సంతరిం చుకోనుం ది. జంక్షన్‌ అభివృద్ధికి రూ. 9 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు. ఇటీవలే నూతనంగా మురుగు కాలువలను నిర్మించారు. దీంతో వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


జంక్షన్‌కు కొత్త అందాలు..

బస్టాండ్‌ జంక్షన్‌లో వాటర్‌ ఫౌంటేన్‌, గార్డెనింగ్‌, హై మాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు, వాహనదారు లకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. న్యూ బస్టాండ్‌ రోడ్డు పను లు చకచకా పనులు కొనసాగుతున్నాయి. నాణ్యతతో పను లను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

రోడ్డు పనులను పరిశీలించిన కుడా చైర్మన్‌

వరంగల్‌: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన హన్మకొండ బస్‌ స్టేషన్‌ జంక్షన్‌ రోడ్డు పనులను గురువారం కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి పరిశీలించా రు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచేలా అధికారులు నిరంత రం పర్యవేక్షించాలని అన్నారు. నాణ్యత పాటించేలా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు కుడా డీఈ వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.