e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home Entertainment సినిమా మ‌రిచిపోలేని మ‌హా మ‌నీషి.. చరిత్ర‌లో ఈరోజు

సినిమా మ‌రిచిపోలేని మ‌హా మ‌నీషి.. చరిత్ర‌లో ఈరోజు

సినిమా మ‌రిచిపోలేని మ‌హా మ‌నీషి.. చరిత్ర‌లో ఈరోజు

దాదా సాహెబ్ ఫాల్కేగా చిర‌ప‌రిచితులైన ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే 1870 లో స‌రిగ్గా ఇదే రోజున మ‌హారాష్ట్ర స‌మీపంలోని త్ర‌యంబకేశ్వ‌రంలో జ‌న్మించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప‌రిశ్ర‌మ‌గా పేరుగాంచిన సినిమా ప‌రిశ్ర‌మ‌కు భార‌త్‌లో ఉన్న‌త స్థాయికి తీసుకురావడంలో ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ఆయ‌న‌ను భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌కు తండ్రిగా ఆరాధిస్తారు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు పితామ‌హుడిగా భావించే గోవింద్ ఫాల్కే శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్ర‌భుత్వం 1969 లో ఆయ‌న పేరిట పుర‌స్కారాన్ని నెల‌కొల్పింది. సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధికి విశేష సేవ‌లందిస్తున్న వ్య‌క్తుల‌కు ఈ అవార్డును బ‌హూక‌రించి స‌త్క‌రిస్తున్నారు.

కళాత్మక అభిరుచి ఉండటంతో 1885 లో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి చిత్రలేఖనం చేర్చుకున్నాడు. ఫొటోగ్రఫీ, మౌల్డింగ్, ఆర్కిటెక్చర్ వంటి అనేక కళలనే కాక మాజిక్ విద్యను కూడా నేర్చుకున్నాడు. తొలినాళ్ల‌లో ఒక డ్రామా కంపెనీలో ఫొటోగ్రాఫ‌ర్‌గా, సీన్ పెయింటర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆర్కియాలాజి విభాగంలో డ్రాప్ట్స్ మన్, ఫోటోగ్రాఫర్ గా 1903 లో ఉద్యోగంలో చేరాడు. కొద్దిరోజుల పాటు అక్క‌డ ప‌నిచేసి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వ‌దేశీ ఉద్య‌మంలో చేరాడు.

1910 లో ఆయ‌న చూసిన లైఫ్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఆయ‌న జీవితంతో పాటు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ రూపురేఖ‌ల‌ను మారుస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఆ సినిమా చూసిన తర్వాత ఎన్నో ఆలోచ‌న‌లు ఆయ‌న‌కు ఆ రాత్రి నిద్ర లేకుండా చేశాయి. చాలా రోజుల పాటు సినిమా నిర్మాణం గురించి ఆలోచిస్తూ ఉండిపోయి అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌య్యాడు. 1912 లో లండ‌న్ కు పోయిన ఫాల్కే.. అక్క‌డ సినిమా నిర్మాణానికి సంబంధించిన ప‌లు సామ‌గ్రిని కొనుగోలు చేసి ఇండియాకు తిరిగి వ‌చ్చి తొలుత 200 అడుగుల చిత్రాన్ని త‌న కుటుంబస‌భ్యుల మీద తీశారు. అనంత‌రం భార్య త‌న ఆభ‌ర‌ణాలు అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బును భ‌ర్త చేతిలో పెట్టి సినిమా నిర్మాణానికి ప్రోత్స‌హించింది.

ఎన్నో క‌ష్ట‌నష్టాల‌కు ఓర్చి నిర్మించిన రాజా హ‌రిశ్చంద్ర సినిమాను 1913 ఏప్రిల్ 21 న ప్రివ్యూ ఏర్పాటుచేశారు. అనంత‌రం కార్పొరేష‌న్ థియేట‌ర్‌లో 23 రోజుల‌పాటు ప్ర‌ద‌ర్శించి రికార్డు నెల‌కొల్పాడు. మ‌రుస‌టి ఏడాది మోహినీ భ‌స్మాసుర చిత్రాన్ని నాసిక్‌లో నిర్మించారు. ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించి భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధిలోకి రావ‌డానికి విశేషంగా కృషిచేసిన ఫాల్కే 1944 ఫిబ్ర‌వ‌రి 16 న తుదిశ్వాస విడిచారు.

తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన శ్రీ‌శ్రీ

సినిమా మ‌రిచిపోలేని మ‌హా మ‌నీషి.. చరిత్ర‌లో ఈరోజు

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీ‌నివాసరావు 1910 లో ఇదే రోజున జ‌న్మించారు. పూడిపెద్ది కుటుంబంలో జ‌న్మించిన‌ప్ప‌టికీ .. శ్రీరంగం సూర్యనారాయణకు దత్త పుత్రుడిగా వెళ్ల‌డం వలన ఇతడి ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేసారు. 1925లో ఎస్ఎస్ఎల్సీ పాసయ్యారు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెండ్లి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం నుంచి బీఏ పూర్తి చేసారు.

1935లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరారు. 1938లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరుగా కూడా విధులు నిర్వ‌ర్తించారు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాం నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు అతను రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.

వెయ్యికి పైగా సినీ గీతాలు రచించి, తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డును అందించిన ఆయన కవిత్వం ఆలోచనాత్మకం. సంప్రదాయ కవితా విధానాన్ని తోసిరాజని కార్మిక, కర్షక, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల బతుకులనే కవితా వస్తువులుగా ఎన్నుకుని శ్రీశ్రీ ఆలోచన రేకెత్తించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి “రాజా లక్ష్మీ ఫౌండేషను” అవార్డు వంటి ఎన్నో పుర‌స్కారాల‌ను అందుకున్నారు. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసారు. క్యాన్స‌ర్ వ్యాధికి గురైన శ్రీ‌శ్రీ 1983 జూన్ 15 న తుదిశ్వాస విడిచారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2020: న‌టుడు అభిషేక్ రిషి కపూర్ కన్నుమూత‌

2008: ఒడిశాలోని బాలసోర్ జిల్లాలోని చండీపూర్ బీచ్ నుంచి విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన‌ డ్రైవర్ లెస్ విమానం “టార్గెట్”

1975: ముగిసిన‌ వియత్నాం యుద్ధం

1956: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ఆల్బెన్ బార్క్లీ వర్జీనియాలో మరణం

1945: ఆత్మ‌హ‌త్య చేసుకున్న జర్మన్ నియంత హిట్లర్, అతడి భార్య ఎవా బ్రౌన్

1908: ముజాఫర్‌పూర్‌లో కింగ్స్‌ఫోర్డ్ మేజిస్ట్రేట్‌ను చంపడానికి బాంబులు విసిరిన‌ ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకి

1789: యునైటెడ్ స్టేట్స్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన జార్జ్ వాషింగ్టన్

1030: ఘజ్నవి రాజవంశం మొదటి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ మహముద్ మరణం

ఇవి కూడా చ‌ద‌వండి…

సెంకాకు ద్వీపాన్ని స‌ర్వే చేసిన చైనా.. మ‌రోసారి జ‌పాన్‌తో ఉద్రిక్త‌త‌

తక్కువ లక్షణాలున్న కరోనా రోగులపై ఈ ఔషధం ప్రభావవంతం: ఆయుష్ మంత్రిత్వ శాఖ

బోర్డ‌ర్ రోడ్ ఆర్గ‌నేజ‌న్‌లో తొలి మ‌హిళా అధికారిగా వైశాలి నియామ‌కం

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

ఈ విట‌మిన్ సీ పండ్లు తినండి.. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోండి..!

ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు

అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను ప్ర‌యోగించిన‌ చైనా

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
సినిమా మ‌రిచిపోలేని మ‌హా మ‌నీషి.. చరిత్ర‌లో ఈరోజు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement