మక్కల అన్లోడ్లో జాప్యం.. లారీ డ్రైవర్ మృతి
ధాన్యం అన్లోడ్ జాప్యానికి ఓ నిండుప్రాణం బలైంది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా అక్కడే నిద్రిస్తున్న ఓ లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ గోదాముల వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
- నస్పూర్ గోదాముల వద్ద మూడు రోజులుగా పడిగాపులు
- ప్రమాదవశాత్తు లారీపై నుంచి పడి మృత్యువాత
సీసీసీ నస్పూర్, మే 24 : ధాన్యం అన్లోడ్ జాప్యానికి ఓ నిండుప్రాణం బలైంది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా అక్కడే నిద్రిస్తున్న ఓ లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ గోదాముల వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్కు చెందిన ఇంద్రావర్ శంకర్(38), తన కొడుకు ఇంద్రావర్ రోషన్తో కలిసి ఈ నెల 22న మక్కలు లోడ్ చేసుకొని నస్పూర్ పట్టణంలోని గోదాముల వద్దకు వచ్చాడు. అన్లోడ్కు అవకాశం ఇవ్వకపోవడంతో ఇక్కడే ఉంటున్నారు.
అధికారులు దూరం నుంచి వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వకుండా లోకల్ వారికి ప్రాధాన్యతనివ్వడంతో వారు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మక్కలు అన్లోడ్ చేయకపోవడంతో తాము నానా ఇబ్బందులకు గురవుతున్నామని ఆదిలాబాద్, నిర్మల్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు శనివారం గోదాముల వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.
శనివారం రాత్రి తండ్రీకొడుకులు లారీపైకెక్కి పడుకొన్నారు. ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటల ప్రాంతంలో శంకర్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలయ్యాయి. కొడుకు రోషన్ లేచి చూసే సరికి తండ్రి కిందపడి ఉన్నాడు. తోటి డ్రైవర్ల సాయంతో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే శంకర్ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదవశాత్తు నిద్రలో లారీపై నుంచి కిందపడి చనిపోయినట్టు ఆయన భార్య ఇంద్రవర్ రీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మేకల ప్రశాంత్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

