ఆదివారం 31 మే 2020
Warangal-city - May 08, 2020 , 06:35:38

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, నమస్తే తెలంగాణ/పరకాల టౌన్‌/దామెర/నడికూడ/కమలాపూర్‌: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాలలోని పద్మశాలీ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి ఆధ్వర్యంలో హెచ్‌పీఆర్‌ ఇన్‌ఫ్రా అందించిన నిత్యావసరాలను ప్రైవేట్‌ డ్రైవర్లు, మెకానిక్‌లు, వెల్డర్లకు పంపిణీ చేశారు. మల్లక్కపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దామెర మండలం ముస్త్యాలపల్లిలో పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నడికూడ, కమలాపూర్‌ మండలాల్లోని నార్లాపూర్‌-వెంకటేశ్వర్లపల్లి గ్రామశివారులోని వాగులో చెక్‌ డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి రూ. 6.18 కోట్లతో చేపట్టనున్న పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్‌ఫ్రా చైర్మన్‌ కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోద అనిత, వైస్‌ చైర్మన్‌ విజయపాల్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ వినయ్‌, పరకాల మార్కెట్‌ చైర్మన్‌ రమేశ్‌, జెడ్పీటీసీలు సుమలత, కల్యాణి, ఎంపీపీలు రాణి, అనసూర్య పాల్గొన్నారు. logo