e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు మంత్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

మంత్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

మంత్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

మహబూబ్‌నగర్‌, మే 30 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్ఫూ ర్తితో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లెపోగు శ్రీనివాస్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో బాటసారులకు భోజనం అందజేశారు. లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో తమవంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణ, భారత్‌ పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ
జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కాలనీ సంక్షేమ సంఘం ఆ ధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు నిత్యావసర సరుకులను పం పిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ఆశ కార్యకర్తలకు కొంతైన సాయం అందించాలన్న ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు శం కర్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి వెంకట్రాములు, కార్యదర్శి ఓంకార్‌, గోపాల్‌, నర్సింహు లు, రాజేందర్‌, బుట్ట శ్రీనివాసులు, గణేశ్‌, చంద్రశేఖర్‌, సోలాకి, వెంకటరమణ, గణేశ్‌ పాల్గొన్నారు.
బాధితులను ఆదుకోవాలి
హన్వాడ, మే 30 : మండలంలోని యువజన సంఘా లు, పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరో నా బాధితులను ఆదుకోవాలని బీజేపీ మం డల అధ్యక్షుడు వెంకటయ్య అన్నారు. మం డలంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల ను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, నారాయణ, రాజు, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పేద కుటుంబానికి చేయూత
దేవరకద్ర రూరల్‌, మే 30 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబానికి సామాజికవేత్త దండు వెంకటేశ్‌ అండ గా నిలిచారు. ఆదివారం తక్షణ సాయంగా 25కిలోల సన్నబియ్యం, గుడ్లు, పాలు, నిత్యావసర సరుకులు అందజేశా రు. ఆపదలో ఆదుకున్న వెంకటేశ్‌కు శ్రీనివాసులు కుటుంబసభ్యులు కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో వెంకటన్న, ఖర్జానా, మహేందర్‌, బాబు, కుర్మన్న, మధుసూద న్‌, రామకృష్ణ పాల్గొన్నారు.
వాస్విక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో…
మిడ్జిల్‌, మే 30 : వాస్విక్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నిడిగొండ నరేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మండ లంలో జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి పిల్లెల శ్రీకాంత్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవలందిస్తున్న వారికి వాస్విక్‌ ఫౌండేషన్‌ తరఫున మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాస్విక్‌ ఫౌండేషన్‌ సభ్యులు కొత్తూర్‌ మల్లేశ్‌, పద్మ వినోద్‌కుమార్‌, సాయిబాబు, ప ర్మటి ప్రసాద్‌, పోతుర్లపల్లి ప్రసాద్‌, భీమని మ హేశ్‌ పాల్గొన్నారు.
మాస్కులు, పండ్లు పంపిణీ
బాలానగర్‌, మే 30 : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల కు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ మాస్కులు, పం డ్లను అందజేశారు. అలాగే సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభు త్వ దవాఖానలో రోగులకు పండ్లు అందజేశారు. కార్యక్రమాల్లో నాయకులు శ్రీశైలం, సతీశ్‌, నర్సింహులు, రాము లు, కృష్ణయ్య పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మంత్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు

ట్రెండింగ్‌

Advertisement