గురువారం 03 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 12, 2020 , 09:37:11

వనపర్తి జిల్లాలో రెండు ఎపోడమిక్‌ డిసీస్‌ బృందాలు

వనపర్తి జిల్లాలో రెండు ఎపోడమిక్‌ డిసీస్‌ బృందాలు

  • బృందంలో 14 మంది సిబ్బంది   
  • ప్రతి గ్రామానికీ ఒక నిర్ధేశిత రోజు 
  • వృద్ధులు, పిల్లలు, గర్భిణులపై ప్రత్యేక దృష్టి

వర్షాకాలం.. వ్యాధుల కాలం.. ఈ సీజన్‌లో ప్రజలను పైలంగా  ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో రెండు ఎపోడమిక్‌ డిసీస్‌ బృందా లను నియమించారు. ఒక్కో బృందంలో 14 మంది సిబ్బంది ఉంటారు. వీరు నిర్ధేశిత రోజు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. అవసర మైన వారికి వైద్య పరీక్షలు చేయనున్నారు. చిన్నారుల, గర్భిణులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. 

వర్షాకాలం.. వ్యాధుల కాలం.. ఈ సీజన్‌లో ప్రజలను పైలంగా  ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో రెండు ఎపోడమిక్‌ డిసీస్‌ బృందా లను నియమించారు. ఒక్కో బృందంలో 14 మంది సిబ్బంది ఉంటారు. వీరు నిర్ధేశిత రోజు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. అవసర మైన వారికి వైద్య పరీక్షలు చేయనున్నారు. చిన్నారుల, గర్భిణులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. 

వనపర్తి, నమస్తే తెలంగాణ : వానకాలంలో ప్రబలే సీజనల్‌ వ్యాధులపై వైద్యారోగ్యశాఖ తగిన చర్యలు చేపట్టింది. ఏజెన్సీ ఏరియాల్లో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎపోడమిక్‌ డిసీస్‌ బృందాలను ఏర్పాటు చేసి వనపర్తి జిల్లాలో క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. మలేరియా టీం, మేల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లలతో కలిపి 14 మంది సిబ్బంది నిత్యం గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామానికి నిర్ధేశిత రోజును ఏర్పాటు చేసి వృద్ధులు, పిల్లలు, గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దవాఖానకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. దీంతో ఆ ప్రాంతాల్లో వ్యాధులు పెరిగి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. కొవిడ్‌ 19 వంటి భయంకరమైన, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వానకాలం లో ప్రబలకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రా మాల్లో పర్యటించేందుకు ప్రభుత్వం ఎపోడమిక్‌ డిసీస్‌ టీంలను ఏర్పాటు చేసింది. ఈ సిబ్బంది అంటు వ్యాధులు ప్రబలినప్పుడు అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు. ఆ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి రోగా లు రాకుండా చర్యలు తీసుకుంటారు. వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తారు.

రెండు ఎపోడమిక్‌ డిసీస్‌ బృందాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో ప్రజలు రోగాలు వచ్చినా పట్టించుకోకుండా జీవనం కొనసాగిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో రోగాలు ప్రబలినప్పడు వాటిని నిర్ణక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు గుర్తించిన ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చికిత్సలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వనపర్తి జిల్లాలో రెండు ఎపోడమిక్‌ డిసీస్‌ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ బృందంలో ఒక మలేరియా టీం, మేల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌,  కోఆర్డినేటర్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఉంటారు. వీరు ప్రతి గ్రామానికి ఒక నిర్ధేశిత రోజును కేటాయించుకుని మండలాల వారీగా చికిత్సలు అందిస్తారు.  వ్యాధులను గుర్తిస్తారువానకాలం సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉండటంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు వైద్యశాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఎపోడమిక్‌ డిసీస్‌ వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అనారోగ్యానిక గురైన వారి రక్తనమూనాలు సేకరించి వ్యాధులను గుర్తిస్తారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఉన్నతాధికారులను సమాచారం ఇస్తారు. పరీక్షల కోసం హైదరాబాద్‌ పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో వృద్ధులను, చిన్నపిల్లలను, గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో గుర్తిచిన వ్యాధుల వివరాలను నమోదు చేసుకుంటారు. ఏదైనా గ్రామంలో కలరా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు రోగుల సంఖ్యను బట్టి జిల్లా దవాఖానకు తరలించడం, గ్రామంలోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించి చికిత్సలు అందిచడం వంటి చర్యలు చేపడుతారు. భయంకరమైన వ్యాధులతో ఏ ఒక్కరూ మృత్యువాత పడకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. 

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలే వ్యాధులను గుర్తించేందుకు అన్ని చర్యలు చేపట్టాము. పీహెచ్‌సీలకు దూరంగా ఉన్న గ్రామాలపై వైద్య సిబ్బంది దృష్టి కేంద్రీకరిస్తుంది. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడంతో ఎపోడమిక్‌ డిసీస్‌ బృందాలు కీలక పాత్రపోషిస్తున్నాయి. ఎక్కడైనా అంటు రోగాలు ప్రబలితే వెంటనే చర్యలు చేపడుతాము. సీజనల్‌ రోగాలు ఉన్న గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తాము. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామస్తులకు వివరిస్తాం.           - డాక్టర్‌ శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో, వనపర్తి జిల్లా