ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Sep 19, 2020 , 00:31:26

rrbadi.com ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు

rrbadi.com ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు

 రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ‘ఆన్‌లైన్‌ తరగతుల’ కొరకు rrbadi.com అనే వెబ్‌సైట్‌ను జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్‌ ద్వారా 6 నుంచి 10 తరగతిలోపు విద్యార్థులు తెలుగు, ఇంగ్లీ ష్‌ భాషల్లో అన్ని సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం కల్పించామన్నారు. ఉపాధ్యాయులు దీనిపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. యోగా, మెడిటేషన్‌ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతాయన్నారు

  వీడియోలు, వర్క్‌షీట్లు కూడా.. 

 ఈ వెబ్‌ సైట్‌ కోర్‌ కమిటీలో రామచంద్రారెడ్డి, శ్రీనివాస్‌, గిరిధర్‌, కమాల్‌ సింగ్‌, వెంకటయ్య, రాజిరె డ్డి, దినేశ్‌, నరసింహారావు, విజయ్‌కుమార్‌, లక్ష్మణ మూర్తి ఉన్నారు. వీరి పర్యవేక్షణలో గోపాల్‌ సాంకేతిక సహకారంతో వెబ్‌ సైట్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌ ప్రభుత్వ,ప్రైవేట్‌ విద్యార్థులందరికీ అం దుబాటులో ఉంటుంది.విద్యార్థులు ఏసమయంలో నైనా ఓపెన్‌ చేసి పాఠాలను చూసుకోవచ్చు.పా ఠ్యా ంశానికి సంబంధించిన వీడియోలు ఛాయా చిత్రా లు, వర్క్‌షీట్‌లు అందుబాటులో ఉంటాయి.  logo