మోమిన్‌పేట : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో 3గంటల పాటు భారీ వర్షం కురవడంతో మండల పరిధిలోని మొరంగపల్లి, వెల్చాల్, మోమిన్‌పేట, ఎన్కతల, టేకులపల్లి, రాళ్లగుడుపల్లి తదితర గ్రామాల్లో చెరువులు కుంటలు నిండి వాగులు పొంగిపోర్లాయి. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షలకు భూగర్భ జలాలు పెరిగి బావులు నిండుకుండగా మరాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నరు. అదే విధంగా ప్రతి రోజు కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో వర్షాపు నీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో కురిసిన వర్షపాత వివరాలు..
వికారాబాద్ జిల్లాలో మర్పల్లి 36.2, మోమిన్‌పేట 28.0, నవాబుపేట 10.2, వికారాబాద్ 13.2, పూడూరు 28.2, కుల్కచర్ల 0.2, దోమ 0.4, ధారూరు 1.2, బంట్వారం 19.2, తాండూరు 14.2, యాలాల 3.0, పెద్దేముల్ 5.4, బషీరాబాద్ 19.8, బొంరాస్‌పేట 1.0, కొడంగల్ 5.6, దౌల్తాబాద్ 15.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.