ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 30, 2021 , 00:27:06

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

  • ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు రూరల్‌, జనవరి 29: మార్చి నెలాఖరులోగా రూర్బన్‌ పథకం కింద మంజూరైన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాండూరు మండలం, అంతారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లాపూర్‌ క్లస్టర్‌గా మండలానికి రూర్బన్‌ పథకం కింద రూ.30కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. రూర్బన్‌ పథకం కింద ఆక్సిజన్‌ పార్కు, ఇండోర్‌ స్టేడియం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనం, సీసీ రోడ్లు, పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణాలతోపాటు పాఠశాలకు కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మాణాలు కూడా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రూర్బన్‌ పథకం పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాములు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మురళీ, శ్రీనివాస్‌చారి, పలువురు నాయకులు ఉన్నారు.  

మండప నిర్మాణానికి శంకుస్థాపన 

తాండూరు, జనవరి 29: తాండూరు పట్టణంలోని కాళికామాత ఆలయ నూతన మండప నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పూజలు చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపనర్సింహులు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నేతలు, ఆలయకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


VIDEOS

logo