సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 30, 2021 , 00:27:21

టీఆర్‌ఎస్‌తోనే కొడంగల్‌ అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే కొడంగల్‌ అభివృద్ధి

కొడంగల్‌, జనవరి 29 : ప్రభుత్వంతోనే కొడంగల్‌ అభివృద్ధి సాధ్యమని టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షడు నరేశ్‌గౌడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, జడ్పీటీసీ మహిపాల్‌ అన్నారు. శుక్రవారం అంబేద్కర్‌ కూడలిలో చర్చకు సిద్ధం అంటూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్‌ అభివృద్ధిపై సోషల్‌ మీడియాలో ప్రతిక్షాలు విసిరిన సవాల్‌కు సిద్ధంగా అంబేద్కర్‌ కూడలిలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కానీ ఏ ఒక్కరూ హాజరు కాలేకపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కొడంగల్‌ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ఉనికిని కోల్పోతున్నామనే ఉద్దేశంతో ఆరోపించడం సరికాదన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మధుసూదన్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, మహేందర్‌, మల్లేశ్‌, వెంకటప్ప, జగన్‌, నెహ్రూ నాయక్‌, అరుణ్‌కుమార్‌, రవిగౌడ్‌, చరణ్‌గౌడ్‌, రఘు, కృపాసాగర్‌, సంతోష్‌కుమార్‌తో పాటు మహిళా విభాగం అన్నుబాయి పాల్గొన్నారు. 

VIDEOS

logo