శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Nov 21, 2020 , 04:04:19

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి

పెద్దేముల్‌ : పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించి వారికి తగిన న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో రెండో రోజు కూడా సాధారణ తనిఖీలో భాగంగా పలు రికార్డు లు, కేసుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి పట్ల గౌరవంగా మాట్లాడుతూ, మర్యాదగా ప్రవర్తించాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలకు సంబంధించిన కేసుల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి వారికి తగిన న్యాయం చేయాలన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని వ మ్ము చేయకుండా ప్రతి ఒక్క పోలీసు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తూ వారికి తగిన న్యాయం చేయాలన్నారు. తనిఖీల సమయంలో ఆయన వెంట తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్‌, ఏఎస్‌ఐలు ఖాజామైనోద్దీన్‌, మల్లయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.