సోమవారం 08 మార్చి 2021
Vikarabad - Nov 08, 2020 , 04:04:27

‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం

‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం

కులకచర్ల: తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 28 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంలా ఉపయోగపడుతున్నదని అన్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్‌ పెద్దన్న పాత్ర పోషించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ద్వారా డబ్బులు నేరుగా అమ్మాయి తల్లిఖాతాలో జమచేస్తున్నారని అన్నారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు.  రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి  సీఎం దేశానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు.  ముస్ల్లింలకు షాదీముబారక్‌ పథకం ద్వారా పెళ్లికి డబ్బులు అందిస్తున్నారని వివరించారు.  ఈ సందర్భంగా మండలంలోని 28 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు.  కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌,  రైతు బంధు మండల సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు సారా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి గుండు మల్లనర్సింహులు, కులకచర్ల ఎంపీటీసీ ఆనందం, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, తాసిల్దార్‌ అశోక్‌కుమార్‌, డిప్యూటీ తాసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజప్ప, హరికృష్ణ, మొగులయ్య, వెంకటయ్యగౌడ్‌, జుబేర్‌, అంతారం ఎంపీటీసీ లలిత, లబ్ధిదారులు  పాల్గొన్నారు.  

VIDEOS

logo